దేశవ్యాప్తంగా ప్రజలు ఎదురుచూస్తున్న సినిమాల్లో ఆర్ఆర్ఆర్ సినిమా ఒకటి. ఈసినిమా ఒక పక్క పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తిచేసుకుంటూనే మరోపక్క ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేసేశారు మేకర్స్. ఇప్పటికే ఈసినిమా నుండి విడుదలైన పోస్టర్లు పాటలు ఓ రేంజ్ లో సోషల్ మీడియాలో దూసుకుపోతున్నాయి. తాజాగా ఈసినిమా నుండి జననీ అనే పాటను రిలీజ్ చేశారు. ఈ పాట రిలీజ్ కు ముందు రాజమౌళి ప్రెస్ మీట్ కూడా పెట్టారు. నేడు ఆర్ఆర్ఆర్ సోల్ యాంథమ్ పేరుతో ఈ పాటను రిలీజ్ చేసింది చిత్రయూనిట్. అజయ్ దేవగన్, తారక్, చరణ్, శ్రియ, అలియా భట్ పై అద్భుతమైన విజువల్స్ తో ఈ సాంగ్ ను కట్ చేశారు. బ్రిటీష్ పాలకులు మనపై చేసిన దాడులు.. వారికి ఎదురుగా నిలిచి హీరోలు పోరాటం చేయడం చూపించారు. ప్రస్తుతం ఈపాట సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
#Janani/#Uyire is here to unfold the soul of #RRRMovie in all its glory, intensity and power.https://t.co/tgWAOVTLn5#RRRSoulAnthem, conceived by @ssrajamouli and composed by @mmkeeravaani, out now!
— Jr NTR (@tarak9999) November 26, 2021
కాగా దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్ఆర్‌ఆర్. ఈ సినిమాలో యంగ్ టైగర్ జూ. ఎన్టీఆర్ కొమురం భీమ్‌గా, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటిస్తుండగా.. ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ భామ ‘ఒలివియా మోరిస్’ నటిస్తుంది. ఇక ముఖ్యమైన పాత్రల్లో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్, సముద్రఖని, రే స్టీవెన్సన్, ఆలిసన్ డూడి కూడా నటిస్తున్నారు. డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ పతాకం పై దానయ్య ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. జనవరి 7న ప్రపంచ వ్యాప్తంగా సుమారు 10,000 థియేటర్లలో దీనిని విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: