మీకు బాగా నచ్చిన నాగచైతన్య సినిమా..?

Naga Chaitanya Birthday Special Poll Which Among These Is Your Favourite Film VOTE NOW,Yuva Samrat Naga Chaitanya,Akkineni Naga Chaitanya,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Naga Chaitanya Latest Movie,Naga Chaitanya New Movie,Naga Chaitanya 35th Birthday,Naga Chaitanya,Actor Naga Chaitanya,Hero Naga Chaitanya,Naga Chaitanya Movies,On Naga Chaitanya's 35th Birthday,Naga Chaitanya Turns 35,Naga Chaitanya Movies List,Naga Chaitanya Blockbuster Movies,Happy Birthday Naga Chaitanya,HBD Naga Chaitanya,On Naga Chaitanya's Birthday,Naga Chaitanya Birthday,Naga Chaitanya Latest News,Naga Chaitanya’s Best Movies,Naga Chaitanya Best Movies,TFN Wishes,Naga Chaitanya Top Movies List,Naga Chaitanya Birthday Special,Naga Chaitanya's Best Films,Naga Chaitanya's Movies,Hero Naga Chaitanya Most Popular Movies,Naga Chaitanya Best Movies List,Naga Chaitanya Best Movie,Favourite Movie Of Naga Chaitanya,POLL,Best Movies Of Naga Chaitanya,Best Movies Of Akkineni Naga Chaitanya,The Best Of Naga Chaitanya Movies,Best Of Naga Chaitanya Movies,Best Movies Of Yuva Samrat Naga Chaitanya,Top Best Movies Of Naga Chaitanya,Naga Chaitanya Hits,Naga Chaitanya Film Career,Love Story,Majili,Autonagar Surya,Premam,Rarandoi Veduka Chudham,Sahasam Swasaga Sagipo,Manam,100% Love,Ye Maaya Chesave,#HBDYuvasamratNagaChaitanya,#HBDNagaChaitanya

అక్కినేని వంశం మూడోత‌రం క‌థానాయ‌కుడుగా తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైన నటుడు నాగ చైతన్య. అక్కినేని వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నాగచైతన్య తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. జోష్ సినిమాతో వెండితెరకు పరిచయమైన ఈ యంగ్ హీరోకు మొదటి సినిమా మాత్రం ఫ్లాప్ నే మిగిల్చింది. అయినా కూడా ఎలాంటి నిరాశ చెందకుండా తను మాత్రం సినిమాలు చేసుకుంటూ వెళ్లాడు. ఆ తరువాత గౌత‌మ్ మీన‌న్ ద‌ర్శ‌క‌త్వంలో ఏమాయ చేసావే చిత్రంలో ల‌వర్ బాయ్ గా అద్భుతంగా న‌టించి ఇండస్ట్రీలో తన మార్క్ ను వేశాడు. ఆత‌ర్వాత సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో 100% ల‌వ్ సినిమాలో పాత్ర‌కు త‌గ్గ అభిన‌యం ప్ర‌ద‌ర్శించి మ‌రో విజ‌యాన్ని సొంతం చేసుకున్నాడు. ఏమాయ చేసావే, 100% ల‌వ్…ఈ రెండు రొమాంటిక్ మూవీస్ తో క్లాస్ హీరోగా సూప‌ర్ స‌క్సెస్ అయ్యాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అయితే క్లాస్ ఒక్కటే సరిపోదు మాస్ హీరోగా కూడా ప్రేక్షకులకు దగ్గరవ్వాలి. ఆ ప్రయత్నలోనే ద‌డ‌, బెజ‌వాడ, త‌డాఖా లాంటి సినిమాలు తీశాడు. ఇక ఆతర్వాత వచ్చిన సినిమా మనంతో చైతూ మరో మెట్టు ఎక్కాడని చెప్పొచ్చు. ఈసినిమాలో తాత నాగేశ్వర్రావు తో నాన్న నాగార్జున తో కలిసి నటించి రెండు డిఫ‌రెంట్ షేడ్స్ ఉన్న క్యారెక్ట‌ర్ లో ఒదిగిపోయి..ఏ పాత్ర అయినా చైతు చేయ‌గ‌ల‌డ‌ని నిరూపించాడు. ఆ తర్వాత ఆటోన‌గ‌ర్ సూర్య, ఒక లైలా కోసం, దోచెయ్, ప్రేమమ్, సాహ‌సం శ్వాస‌గా సాగిపో సినిమాలు తీయగా వాటిలో ప్రేమమ్ తప్ప మిగిలినవి నిరాశనే మిగిల్చాయి. ఆ తర్వాత వచ్చిన యుద్దం శరణం, సవ్యసాచి, శైలజా రెడ్డి అల్లుడు, వెంకీమామ సినిమాలు పర్వాలేదనిపించాయి. ఆ తర్వాత మజిలీ, లవ్ స్టోరీ ల సూపర్ సక్సెస్ తో ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. ప్రస్తుతం నాగ చైతన్య థాంక్యూ సినిమా చేస్తున్నాడు. అలాగే లాల్ సింగ్ చద్దా అనే సినిమాతో బాలీవుడ్ లోకి కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.

ఇక ముందు ముందు కూడా నాగ చైతన్య ఎన్నో బర్త్ డే లు జరుపుకోవాలని.. ఇంకా మరెన్నో మంచి మంచి సినిమాలు తీసి అందరినీ అలరించాలని కోరుకుందాం. మరి కింద ఇచ్చిన సినిమాల్లో మీకు బాగా నచ్చిన నాగచైతన్య సినిమా ఏది అనేది మీ ఓటు ద్వారా తెలియచేయండి.

మీకు బాగా నచ్చిన నాగచైతన్య సినిమా..?

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here