నవీన్ చంద్ర, అవికా గోర్ అన్నా చెల్లెళ్లుగా వస్తున్న సినిమా బ్రో. ఇప్పటివరకూ పలు సినిమాల్లో హీరో హీరోయిన్లుగా నటించిన నవీన్ చంద్ర మొదటిసారి ఈసినిమాతో అన్నా చెల్లెళ్లుగా వస్తున్నారు. మరాఠీలో విజయవంతమైన ‘హ్యాపీ జర్నీ’కు రీమేక్ గా ఈసినిమాను తెరకెక్కించారు. ఇక ఈసినిమాను కూడా ఓటీటీలో రిలీజ్ చేయనున్నారు. ప్రముఖ ఓటీటీ సంస్థ సోనీ లైవ్ లో ఈసినిమా విడుదల కానుంది. ఈనేపథ్యంలోనే ఈసినిమా ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు చిత్రయూనిట్. దీనిలో భాగంగానే ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. అన్నాచెల్లెళ్ల అనుబంధం నేపథ్యంలో ఒకపక్క కామెడీ మరోవైపు సెంటిమెంట్ కూడా ఉండటంతో ఈసినిమా ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వస్తుంది. మరోవైపు ఈసినిమా నుండి ఇప్పటికే పాటలు రిలీజ్ చేయగా అవి కూడా అందరినీ ఆకట్టుకుంటున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా కార్తీక్ తురుపాని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈసినిమాను మ్యాంగో మాస్ మీడియా, జె. జె. ఆర్. ఎంటర్ టైన్మెంట్స్ పై జె. జె. ఆర్. రవిచంద్ నిర్మిస్తున్నారు. శేఖర్ చంద్ర ఈసినిమాకు సంగీతం.. అజీమ్ మహమ్మద్ సినిమాటోగ్రఫి అందిస్తున్నాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: