శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ “హుషారు” మూవీ ఫేమ్ శ్రీ హర్ష కొనుగంటి దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు సోదరుడు శిరీష్ తనయుడు ఆశిష్ , అనుపమ పరమేశ్వరన్ జంటగా కాలేజీ నేపథ్యంలో తెరకెక్కిన యూత్ ఫుల్ కమర్షియల్ ఎంటర్టైనర్ “రౌడీ బాయ్స్” మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది . సాహిదేవ్ విక్రమ్ , కార్తీక్ రత్నం , కోమలి ప్రసాద్ ముఖ్య పాత్రలలో నటించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ , మోషన్ పోస్టర్ , టైటిల్ సాంగ్, టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
“రౌడీ బాయ్స్”మూవీ రిలీజ్ డేట్ నవంబర్ 19 తేదీగా మేకర్స్ అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. అనుకోని కారణాల వల్ల విడుదల వాయిదా పడింది. “రౌడీ బాయ్స్”మూవీ రిలీజ్ డేట్ త్వరలోనే అనౌన్స్ చేస్తామనీ , కాలేజీ రోజులు గుర్తు చేసుకోడానికి రెడీ గా ఉండండి అంటూ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ ట్వీట్ చేసింది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: