సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ పరుశురామ్ దర్శకత్వంలో వస్తున్న సినిమా ‘సర్కారు వారి పాట’. ఇక ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ముందుగా దుబాయ్ లో తొలి షెడ్యూల్ షూటింగును పూర్తి చేసిన సర్కారు వారి పాట టీమ్, ఆ తరువాత గోవాలో ఓ షెడ్యూల్ ను కూడా పూర్తిచేసింది. ఈ రెండు షెడ్యూల్స్ లోను భారీ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించారు. ఇటీవలే స్పెయిన్ లో కూడా కొన్ని కీలక సన్నివేశాలతో పాటు ఒక పాటను కూడా షూట్ చేసినట్టు తెలుస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఈసినిమాను 2022 సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. ఇక ఇప్పుడు సంక్రాంతి బరి నుండి ఈసినిమా తప్పుకుంది. ఈనేపథ్యంలో కొత్త రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు చిత్రయూనిట్. సినిమా రిలీజ్ ను సమ్మర్ కు పోస్ట్ పోన్ చేశారు. ఏప్రిల్ 1వ తేదీన ఈసినిమాను రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.
April 1st 2022!! 😊#HappyDiwali @KeerthyOfficial @ParasuramPetla @madhie1 @MusicThaman @MythriOfficial @GMBents @14ReelsPlus #SarkaruVaariPaata pic.twitter.com/fw83zwDC7T
— Mahesh Babu (@urstrulyMahesh) November 3, 2021
కాగా ఈసినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాలో విలన్‌గా సముద్రఖని కీలక పాత్రలో కనిపించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీయంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లు సంయుక్తంగా ఈసినిమాను నిర్మిస్తున్నాయి. థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఇక బ్యాంకింగ్ రంగంలోని కుంభకోణాల చుట్టూ కథ సాగుతోందని ఇప్పటికే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే కదా.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: