సూపర్ స్టార్ మహేష్ బాబు , కీర్తి సురేష్ జంటగా మైత్రీ మూవీ మేకర్స్ , 14 రీల్స్ ప్లస్ , జి ఎమ్ బి ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ కామెడీ “సర్కారు వారి పాట” మూవీ 2022 సంవత్సరం జనవరి 13 వ తేదీ సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. ఈ మూవీ లో సముద్రఖని , వెన్నెల కిషోర్ , సుబ్బరాజు ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.హైదరాబాద్ , గోవా లలో షూటింగ్ షెడ్యూల్స్ కంప్లీట్ చేసుకున్న ”సర్కారు వారి పాట”మూవీ షూటింగ్ ప్రస్తుతం స్పెయిన్ దేశంలో జరుగుతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
హీరోయిన్ కీర్తి సురేష్ బర్త్ డే (అక్టోబర్ 17) సందర్భంగా, ఆమెకు విషెస్ తెలియజేస్తూ చిత్ర యూనిట్ ఒక కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేసింది. . హీరో మహేశ్ బాబు, దర్శకుడు పరశురామ్ సహా మిగతా యూనిట్ సభ్యులు కీర్తికి స్పెషల్‌గా బర్త్ డే విషెస్ తెలిపారు. “సర్కారు వారి పాట”మూవీతో పాటు మెగాస్టార్ చిరంజీవి “భోళా శంకర్”, నేచురల్ స్టార్ నాని “దసరా”మూవీ లోనూ కీర్తి సురేష్ నటించనున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: