‘దిల్’ రాజు సోదరుడు, నిర్మాత శిరీష్ తనయుడు ఆశిష్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘రౌడీ బాయ్స్’. దిల్ రాజు వారసత్వంగా సినీ ఇండస్ట్రీకి పరిచయం కానుండటంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. అంతేకాకుండా దిల్ రాజు కూడా ఈసినిమాపై స్పెషల్ కేర్ తీసుకొని మరీ నిర్మిస్తున్నాడు. ఇక ఇటీవలే ఈసినిమా ఫస్ట్ లుక్ ను అలాగే టీజర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఫస్ట్ లుక్ రిలీజ్ నే ఎంత గ్రాండ్ గా దిల్ రాజు చేశాడో చూశాం. ఇదిలా ఉండగా ఇన్ని రోజులు ఈసినిమా షూటింగ్ తో బిజీగా ఉంది. నేటితో సక్సెస్ ఫుల్ గా ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంది. ఇక త్వరలోనే పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా మొదలుపెట్టి సినిమాను వీలైనంత త్వరగా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
#RowdyBoys have wrapped up the shoot. They will come super soon to add you in their gang. Stay tuned!#Ashish@anupamahere @HarshaKonuganti @ThisisDSP @Madhie1 @SVC_official @adityamusic#sahidevvikram #karthikrathnam #tejkurapati @komaleeprasad#RowdyBoys pic.twitter.com/ZdBKAYJAjU
— Sri Venkateswara Creations (@SVC_official) October 13, 2021
కాగా ఈసినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తుంది. సాహిదేవ్ విక్రమ్ , కార్తీక్ రత్నం , కోమలి ప్రసాద్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ‘హుషారు’ ఫేమ్ శ్రీహర్ష దర్శకత్వంలో శ్రీవేంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు స్వయంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి మది సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: