సక్సెస్ ఫుల్ యాంకర్ గా బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్న అనసూయ నటన కు ప్రాధాన్యత ఉన్న మూవీస్ ను సెలక్ట్ చేసుకుని వెండితెర ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందిన బ్లాక్ బస్టర్ “రంగస్థలం“మూవీ లో రంగమ్మత్త గా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు.. టాలెంటెడ్ యాక్ట్రెస్ అనసూయ ప్రస్తుతం “పుష్ప“, “రంగమార్తాండ “, “ఖిలాడి “,మూవీస్ లో కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఒక ఆంథాలజీ మూవీకి అనసూయ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అనసూయ ఇప్పుడు చిరంజీవి”గాడ్ ఫాదర్ ” మూవీ లో ఒక కీలక పాత్రకు ఎంపిక అయ్యారు. మమ్ముట్టి హీరోగా తెరకెక్కుతున్న “భీష్మ పర్వం “(మలయాళ ) మూవీ తో అనసూయ మలయాళ చిత్ర పరిశ్రమకు పరిచయం అవుతున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ , అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై మాస్ డైరెక్టర్ నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో రవితేజ హీరోగా మాస్ ఎంటర్ టైనర్ మూవీ “#RT 69 ” తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఫన్ , ఫ్యామిలీ ఎమోషన్స్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ అక్టోబర్ 4వ తేదీ ప్రారంభం అయ్యింది. పలు మూవీస్ లో స్పెషల్ సాంగ్స్ తో ప్రేక్షకులను అలరించిన అనసూయ ఈమూవీ లో ఒక స్పెషల్ సాంగ్ కు ఎంపిక అయ్యారని సమాచారం.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: