ప్రస్తుతం యాంకర్ రవి బిగ్ బాస్ హౌస్ లో ఉన్న సంగతి తెలిసిందే కదా. అయితే ఈ సందర్భంగా రవి తన ముద్దుల కూతురు వియా కి స్పెషల్ వీడియో ద్వారా పుట్టిన రోజు శుభాకాంక్షలు అందించాడు. అదేంటి రవి హౌస్ లో ఉండగా వీడియో ఎలా పంపించడబ్బా అనుకుంటున్నారా.. అసలు సంగతేంటంటే.. బిగ్ బాస్ హౌస్ కు వెళ్లేముందు కంటెస్టెంట్స్ ను క్వారంటైన్ లో ఉంచుతారన్న సంగతి తెలిసిందే కదా. ఇక ఈ నేపథ్యంలోనే క్వారంటైన్ పీరియడ్ లో ఉన్నప్పుడే రవి తన కూతురు వియా కోసం బర్త్ డే విషెస్ అందిస్తూ స్పెషల్ గా వీడియో తీసుకున్నాడు. ఇక ఇప్పుడు వియా పుట్టిన రోజు సందర్భంగా రవి స్పెషల్ వీడియో ను తన సోషల్ మీడియా ఖాతా ద్వారా పోస్ట్ చేశారు. మరి రవికి కూతురు వియా అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చాలా సందర్భాల్లో అది చూశాం కూడా. బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చేముందు కూడా వియాకు ఎంతో ఇష్టమైన బొమ్మను కూడా తెచ్చుకున్నాడంటేనే ఇద్దరి మధ్య ఎంత బాండింగ్ ఉందో తెలుస్తుంది. మరి ప్రస్తుతం బిగ్ బాస్ 5 వారాలు పూర్తి చేసుకొనిఆరో వారంలోకి అడుగుపెట్టింది. ఇక రవి కూడా ఇప్పుడున్నట్టే కూల్ గా ఓపికతో ఉండి టాప్ కంటెస్టెంట్ గా నిలవాలని కోరుకుందాం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: