ఆర్‌ఎక్స్ 100 వంటి బ్లాక్ బస్టర్ తర్వాత అజయ్ భూపతి దర్శకత్వంలో వస్తున్న సినిమా ‘మహా సముద్రం’. ఇన్‌టెన్స్ లవ్, యాక్షన్ డ్రామాగా రూపొందుతోన్న ఈసినిమాలో శర్వానంద్, సిద్దార్థ్ హీరోలుగా చేస్తున్నారు. ఇక ఈసినిమాపై మొదటి నుండి మంచి అంచనాలే ఉన్నాయి. దానికి తోడు శర్వా-సిద్దార్థ్ కాంబినేషన్ లో రావడం..ఇక ఇప్పటికే ఈసినిమా నుండి టీజర్, ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ కూడా రావడంతో సినిమాపై అందరికీ ఆసక్తి పెరిగింది. ఇక దసరా కానుకగా అక్టోబర్ 14న రాబోతున్న నేపథ్యంలో సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు స్టార్ట్ చేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా తాజాగా ఈసినిమా సెన్సార్ కూడా పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్దంగా ఉంది. ఈసినిమాను చూసిన సెన్సార్ బృందం యూఏ సర్టిఫికెట్ ను అందించింది.
కాగా ఈ సినిమాలో అదితి రావు హైదరి, అను ఇమ్మాన్యుయేల్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. రావు రమేష్, జగపతిబాబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఎకె ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ సినిమాకు చైతన్య భరద్వాజ్ సంగీతం అందిస్తుండగా.. రాజ్ తోటా సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నాడు. తెలుగుతో పాటు తమిళంలో కూడా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: