మొత్తానికి మన హీరోలు ఒకరి సినిమాలను మరొకరు బాగానే సపోర్ట్ టేసుకుంటున్నారు. ముఖ్యంగా ప్రభాస్ అయితే ఇతర హీరోల సినిమాలను చూసి అవి నచ్చిేత వెంటనే తన సోషల్ మీడియా ద్వారా రియాక్ట్ అవుతున్నాడు. ఇక ఇప్పుడు మహా సముద్రం ట్రైలర్ పై కూాడా ప్రభాస్ స్పందించగా దీంతో ఈసినిమాకు మరింత క్రేజ్ పెరిగింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆర్ ఎక్స్ 100 సినిమా తరువాత చాలా గ్యాప్ తరువాత అజయ్ భూపతి దర్శకత్వంలో వస్తున్న సినిమా మహాసముద్రం. ఈసినిమా సెట్స్ పైకి వెళ్లడానికే చాలా టైమ్ పట్టింది. ఇక సెట్స్ పైకి వెళ్లిన తరువాత అజయ్ భూపతి చాాలా తొందరగానే ఈసినిమాను కంప్లీట్ చేశాడు. ప్రస్తుతం అయితే ఈసినిమా రిలీజ్ కు సిద్దమవుతుంది. మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాల్లో కూడా స్పీడు పెంచారు చిత్రయూనిట్. దీనిలో భాగంగానే తాజాగా ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. లవ్, యాక్షన్, ఎమోషనల్ రైడ్ గా సాగిన ఈ సినిమా ట్రైలర్ కూడా సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకొని మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతుంది. విడుదలైన రెండవ రోజు కూడా ట్రైలర్ యూట్యూబ్ టాప్ లో ట్రెండింగ్ అవుతోంది. ఇక తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను చూసిన ప్రభాస్ ట్రైలర్ చాలా ఇంటెన్స్ గా అలాగే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందంటూ టీమ్ కు ఆల్ ద బెస్ట్ చెప్పారు.
కాగా ఈసినిమాలో శర్వానంద్, సిద్దార్థ్ హీరోలుగా నటిస్తుండగా.. అదితి రావు హైదరి, అను ఇమ్మాన్యుయేల్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. రావు రమేష్, జగపతిబాబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఎకె ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ సినిమాకు చైతన్య భరద్వాజ్ సంగీతం అందిస్తుండగా.. రాజ్ తోటా సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నాడు. తెలుగుతో పాటు తమిళంలో కూడా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: