14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై శ్రీను వైట్ల దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా , భారీ తారాగణం తో రూపొందిన యాక్షన్ , కామెడీ ఎంటర్ టైనర్ “దూకుడు “మూవీ 2011 సంవత్సరం సెప్టెంబర్ 23 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. సమంత కథానాయిక. ప్రకాష్ రాజ్ , సోనూసూద్ , బ్రహ్మానందం , వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రలలో నటించారు. థమన్ ఎస్ సంగీతం అందించారు. పోలీస్ ఆఫీసర్ గా మహేష్ బాబు అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి బెస్ట్ యాక్టర్ గా నంది , ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ అందుకున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
“దూకుడు ” మూవీ 7 నంది , 6 ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ అందుకుని రికార్డ్ క్రియేట్ చేసింది. హీరో మహేష్ బాబు , సమంతల కెమిస్ట్రీ , థమన్ స్వరకల్పనలో సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. నేటి తో “దూకుడు “మూవీ 10 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంది. ఈ సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాలలో స్పెషల్ షోస్ ను మేకర్స్ ప్లాన్ చేశారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:
































