శ్రీమతి మనోరమ సమర్పణలో గురప్ప పరమేశ్వర ప్రొడక్షన్స్ బ్యానర్ పై గురు పవన్ దర్శకత్వంలో సుమంత్ అశ్విన్, శ్రీకాంత్, భూమిక చావ్లా, తాన్య హోప్ ప్రధాన పాత్రలలో రోడ్ జర్నీ నేపథ్యంలో “ఇదే మా కథ” మూవీ తెరకెక్కుతుంది. సప్తగిరి, పృథ్వి ముఖ్య పాత్రలలో నటించారు. సునీల్ కశ్యప్ సంగీతం అందిస్తున్నారు. నలుగురు అపరిచితులు బైక్ లపై తమ జీవిత ప్రయాణాన్ని ప్రారంభించి ఏం తెలుసుకున్నారు? అన్నదే ఈ చిత్ర కథ.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
టాలీవుడ్ లోనే తొలి రోడ్ జర్నీ అడ్వెంచరస్ మూవీగా తెరకెక్కతున్న “ఇదే మా కథ”కాన్సెప్ట్ టీజర్ ను విక్టరీ వెంకటేష్ ఆదివారం రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ `ఇదే మా కథ` టీజర్ చాలా బాగుందనీ , ఇలాంటి కొత్త తరహా చిత్రాలు మరిన్ని రావాలని కోరుకుంటున్నాననీ , చిత్ర బృందానికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ మూవీ త్వరలోనే థియేటర్స్ లలో రిలీజ్ కానుందని సమాచారం.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: