దీపావళికే శింబు ‘మానాడు’

Simbu Starrer Maanaadu Movie To Hit Theatres For Deepavali,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Update,Telugu Movies Updates,Maanaadu,Maanaadu Movie,Maanaadu Telugu Movie,Maanaadu Movie Release Date,Maanaadu Telugu Movie Release Date Locked,Maanaadu Release Date Confirmed

తమిళ్ స్టార్ హీరో శింబు కేవలం తమిళ్ లోనే కాదు తన సినిమాలతో తెలుగులో కూడా మంచి క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు. ఈమధ్య కాస్త సినిమాలు తగ్గినా.. సక్సెస్ లు రాకపోయినా ఇప్పుడు విభిన్నమైన కథలతో రావడానికి సిద్దమయ్యాడు. ప్రస్తుతం శింబు వెంకట్ ప్రభు డైరెక్షన్లో ‘మానాడు’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తెలుగులో ‘రీవైన్డ్’ అనే టైటిల్ తో రిలీజ్ చేయనున్నారు. పవర్ ఫుల్ పొలిటికల్ డ్రామా నేపథ్యంలో ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ ను పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టింది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి పలు పోస్టర్లు అలాగే టీజర్ ను రిలీజ్ చేయగా వాటికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇక తాజాగా ఈసినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించారు చిత్రయూనిట్. ఈసినిమాను కూడా దీపావళికే రిలీజ్ చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు. ఇక సూపర్ స్టార్ రజినీ కాంత్ హీరోగా వస్తున్న అన్నాత్తే సినిమా కూడా దీపావళి కే రానున్న నేపథ్యంలో రెండు సినిమాలకు మంచి పోటీ ఉంటుందన్న అభిప్రాయాలు అప్పుడే మొదలయ్యాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఈ సినిమాలో శింబుకు జోడిగా కళ్యాణీ ప్రియదర్శన్‌ నటిస్తుండగా ఎస్‌ఏ చంద్రశేఖర్‌, భారతీరాజా, ప్రేమ్‌జీ అమరన్‌, కరుణాకరన్‌లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 125 కోట్ల భారీ బడ్జెట్ తో హిందీ, తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో సురేష్ కామాక్షి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen − three =