బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా వస్తున్న సినిమా అఖండ. ఈ సినిమా కూడా ఎప్పుడో మొదలైంది కానీ ఇంతవరకూ షూటింగ్ ను పూర్తి చేసుకోలేకపోయింది. ఇప్పటికే చాలా వరకూ షూటింగ్ ను పూర్తి చేసుకోగా ఇప్పుడు తాజాగా మరో షెడ్యూల్ ను స్టార్ట్ చేయనున్నట్టు తెలుస్తుంది. ఇక దసరా కానుకగా “అఖండ”ను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది. తాజా షెడ్యూల్ ను ‘గోవా’లో ప్లాన్ చేసినట్టుగా తెలుస్తోంది. ఈ నెల 13వ తేదీ నుంచి ఈ షెడ్యూల్ షూటింగు మొదలుపెట్టనున్నారట. ప్రధాన పాత్రల కాంబినేషన్లోని కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను అక్కడ చిత్రీకరిస్తారు. ఈ షెడ్యూల్ తో ఈ సినిమా షూటింగు పార్టు పూర్తవుతుందని అంటున్నారు. ప్రధాన పాత్రల కాంబినేషన్లోని కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను అక్కడ చిత్రీకరించనున్నారట. అంతేకాదు ఈ షెడ్యూల్ తో ఈ సినిమా షూటింగు పార్టు పూర్తవుతుందని అంటున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. మిర్యాల సత్యనారాయణ రెడ్డి సమర్పణలో ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎస్.ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు సి.రాంప్రసాద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. అన్ని పనులు త్వరగా పూర్తి చేసి దసరాకు ఈసినిమాను రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారు.
ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ లో సింహా, లెజెండ్ సినిమాలు రాగా ఇప్పుడు వస్తున్నది మూడో సినిమా కావడంతో ఈసినిమాపై కూడా మంచి అంచనాలు ఉన్నాయి. మరి ఈసినిమాతో హ్యాట్రిక్ అందుకుంటారేమో చూద్దాం..
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: