“ఆదిపురుష్ “మూవీ కై ప్రభాస్ డిఫరెంట్ మేకోవర్

Rebel Star Prabhas Makes A Different Make Over For Adipurush Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Update,Telugu Movies Updates,Adipurush,Adipurush Movie,Adipurush Telugu Movie,Prabhas,Adipurush Latest News,Adipurush Movie Updates,Adipurush Telugu Movie Live Updates,Adipurush Movie Shooting Updates,Adipurush Telugu Movie Shooting Latest News

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన “రాధేశ్యామ్“మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 14 వ తేదీ రిలీజ్ కానుంది. హీరో ప్రభాస్ ప్రస్తుతం ఓం రౌత్ దర్శకత్వంలో భారీబడ్జెట్ తో 3డి ఫార్మాట్ లో రామాయణం ఆధారంగా తెలుగు , హిందీ భాషలలో మైథలాజికల్ మూవీ “ఆదిపురుష్ “, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెలుగు , కన్నడ భాషలలో రూపొందుతున్న “సలార్”, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ వరల్డ్ మూవీ “ప్రాజెక్ట్ K “మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హీరో ప్రభాస్ రాముడిగా నటిస్తున్న”ఆదిపురుష్ ” మూవీ లో సీతగా కృతి సనన్ , రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ , లక్ష్మణుడిగా సన్నీసింగ్ నటిస్తున్నారు.“ఆదిపురుష్ ” మూవీ 2022 సంవత్సరం ఆగస్ట్ 11 వ తేదీ తెలుగు , హిందీ భాషలతో పాటు కన్నడ , తమిళ , మలయాళ భాష డబ్బింగ్ వెర్షన్స్ రిలీజ్ కానున్నాయి.“రాధేశ్యామ్ “మూవీ షూటింగ్ ను కంప్లీట్ చేసి హీరో ప్రభాస్ “ఆదిపురుష్” మూవీ షూటింగ్ లో జాయిన్ అయ్యారు. ముంబై లో రెండు నెలల పాటు జరిగే షెడ్యూల్ లో హీరో ప్రభాస్ , కృతి సనన్ , సన్నీ సింగ్ పాల్గొంటున్నారు. ఈ షూటింగ్ షెడ్యూల్ లో దర్శకుడు ఓం రౌత్ “ఆదిపురుష్ ” మూవీ లోని కీలక సన్నివేశాలను తెరకెక్కించడానికి ప్లాన్ చేశారు. అయితే ఈ చిత్రం లో ప్రభాస్ విభిన్న రూపాలలో కనిపించనున్నట్లు , ప్రస్తుతం సినిమా లో కొన్ని సన్నివేశాల కోసం ఒక నిర్దిష్ట రూపం లోకి ప్రభాస్ రావాల్సి ఉందనీ సమాచారం. ప్రభాస్ శరీరంలో ఇటీవల కొన్ని మార్పుల వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని దీంతో యూకే లో ని వరల్డ్ క్లాస్ డాక్టర్ – డైటీషన్ వద్దకు పంపించి అత్యుత్తమ చికిత్స చేయించాలని దర్శకుడు నిర్ణయించడం తో హీరో ప్రభాస్ UK వెళ్ళారని సమాచారం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 − eight =