రాచకొండ విద్యాసాగర్ దర్శకత్వంలో శ్రీనివాస్ అవసరాల హీరోగా, రుహాని శర్మ హీరోయిన్ గా నటించిన వచ్చిన చిత్రం 101 జిల్లాల అందగాడు. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై దిల్ రాజు, శిరీష్, రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగర్లమూడి నిర్మించారు. ఇక ఈ సినిమా నిన్న రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తో ప్రేక్షకుల మన్ననలు గెలుచుకుంది. మరి ఈ సినిమాలో అంతలా ఆకట్టుకున్న హైలైట్స్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం..
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కథ..
సినిమాకి ఆయువు పట్టు ఈ సినిమా కథ. నవ్విస్తూనే ఏడిపించే అద్భుతమైన కథ రాసుకున్నారు శ్రీనివాస్ అవసరాల గారు. సమాజంలో ఎంతో మందిని ప్రతిబింబిస్తూ, ప్రతి ఒక్కరిని కదిలిస్తూ, ఎంతో కొంత మార్పుని స్వాగతం పలికెటువంటి మంచి కథ రాసుకున్నందుకు మెచ్చుకోవాలి.
శ్రీనివాస్ అవసరాల నటన:
పెర్ఫామెన్స్ విషయానికొస్తే శ్రీనివాస్ అవసరాల GSN పాత్రలో జీవించేసాడనే చెప్పాలి. బట్టతల, అధైర్యంతో బాధపడే చాలా మంది ఆయనలో తమని చూసుకుంటారు. ఆయన కామెడీ టైమింగ్ గురించి ఎంత చెప్పిన తక్కువే.
కామెడీ:
బట్టతల కష్టాల్ని చూపిస్తూ, ఆ బట్టతలని కవర్ చేయడంలో అవసరాల పడే పాట్లను చూపిస్తూ భలే కామెడీ పండించారు. హాయిగా నవ్వుకునే హెల్ది కామెడీ ని రాసుకున్నారు.
మ్యూజిక్:
కామెడీ సినిమాలో ఎమోషన్స్ బాగా పండాలంటే చక్కగా నటిస్తే సరిపోదు, దాన్ని ఎలివేట్ చేసేలా మంచి రే రికార్డింగ్ కూడా ఉండాలి. ఆ విషయంలో శక్తికాంత్ కార్తీక్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ని ఎంత మెచ్చుకున్నా తక్కువే.. అంత అద్భుతంగా మ్యూజిక్ ఇచ్చాడు.
డైరెక్షన్:
రాచకొండ విద్యాసాగర్ ని నమ్మి అవసరాల కథని ఇచ్చాడంటే అర్ధం చేసుకోవచ్చు అతని టాలెంట్ ఏంటో. దానికి తగ్గట్టే చక్కని లైట్ హార్టెడ్ ఫ్యామిలీ అండ్ యూత్ఫుల్ మూవీని మనకి ఇచ్చాడు డైరెక్టర్.
ఇలా చెప్పుకుంటే పోతే చాలానే హైలైట్స్ ఉన్నాయ్. అవన్నీ థియేటర్లో సినిమా చూస్తే మీకే తెలుస్తాయి. మరింకెందుకు ఆలస్యం మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తో కలిసి థియేటర్లో ఈ వీకెండ్ నూటొక్క జిల్లాల అందగాడ్ని చూసి ఆనందించండి.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: