అనూప్ భండారీ దర్శకత్వంలో కన్నడ సూపర్ స్టార్ సుదీప్ హీరోగా విక్రాంత్ రోణ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇక ఈసినిమా కూడా ఎప్పుడో మొదలుపెట్టినా కూడా కరోనా వల్ల ఈ మూవీ రిలీజ్ కూడా లేట్ అయింది. నిజానికి ఆగష్ట్ లో రిలీజ్ చేద్దామని అనుకున్నారు కానీ అది కుదరలేదు. ఇక ఈమధ్యనే షూట్ నూ పూర్తి చేసుకొని ప్రస్తుతం రిలీజ్ కు సిద్దమవుతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా నేడు కిచ్చా సుదీప్ బర్త్ డే. ఈ సందర్భంగా ఈసినిమా నుండి ఫస్ట్ గ్లిమ్స్ ను విడుదల చేసింది చిత్ర బృందం. డెడ్ మ్యాన్స్ యాంథమ్ గా వచ్చిన ఈ వీడియో ఆకట్టుకోవడమే కాకుండా హాలీవుడ్ మూవీని తలపించేలా ఉన్నాయి విజువల్స్.
https://t.co/YAcwiR1yzZ
‘The Deadman’s Anthem’#VikrantRonaGlimpse Out Now #HBDKicchaSudeep @KicchaSudeep #VikrantRona @anupsbhandari @JackManjunath @Asli_Jacqueline @neethaofficial @Alankar_Pandian @AJANEESHB @nirupbhandari @shaliniartss @Kichchacreatiin @TSeries @LahariMusic— Kichcha Sudeepa (@KicchaSudeep) September 2, 2021
కాగా జాన్ మంజునాథ్, శాలిని మంజునాథ్ నిర్మిస్తున్న ఈ సినిమాకు బి.. అజనీశ్ లోక్ నాథ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి విలియమ్ డేవిడ్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నాడు. ఇంకా ఈసినిమాలో నిరూప్ భండారి, నీతా అశోక్, జాక్వెలెన్ ఫెర్నాండేజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కన్నడ, తెలుగు, హిందీ, తమిళ, మలయాళ భాషలు సహా ఐదు విదేశీ భాషల్లో 50 దేశాల్లో ‘విక్రాంత్ రోణ’ చిత్రం విడుదల కానుంది.
[subscribe]




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: