“డోలీ సజా కే రఖ్ నా “(1998)మూవీ తో బాలీవుడ్ లో కెరీర్ ప్రారంభించిన జ్యోతిక , సక్సెస్ ఫుల్ “వాలి “మూవీ తో కోలీవుడ్ లో అడుగుపెట్టారు. దక్షిణాది భాషల పలు సూపర్ హిట్ మూవీస్ తో జ్యోతిక ప్రేక్షకులను అలరించారు. “బ్లాక్ బస్టర్ “చంద్రముఖి “మూవీ లో చంద్రముఖిగా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి జ్యోతిక ప్రేక్షకులను అలరించారు. కెరీర్ పీక్ స్టేజ్ లో ఉండగానే హీరో సూర్య ను వివాహమాడి సినిమాలకు దూరం అయ్యారు. సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి జ్యోతిక మరింత సెలక్టివ్ గా ఉమెన్ సెంట్రిక్ సినిమాల్లో నటిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
సోషల్ మీడియాకి చాలా దూరంగా ఉండే జ్యోతిక ఎట్టకేలకు ఇన్‌స్టాగ్రామ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. స్వాతంత్య్ర దినోత్సవం రోజున అడ్వెంచర్ ట్రిప్‌కు వెళ్లిన జ్యోతిక.. త్రివర్ణ పతాకంతో తనలో ఉన్న దేశభక్తిని చాటారు. కశ్మీర్‌లోని సుందర సరస్సుల మధ్య తన టీమ్‌తో దిగిన కొన్ని ఫోటోలను జ్యోతిక ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. బికాత్ అడ్వెంచర్స్ టీమ్‌లోని సభ్యులతో జ్యోతిక హిమాలయ అందాలను తిలకించారు. జ్యోతిక ఇన్ స్టా గ్రామ్ లో ఖాతా తెరిచిన 45 నిమిషాల్లోనే 1.2 మిలియన్ల ఫాలోవర్స్ చేరారు. పెద్ద స్టార్ డమ్ ఉన్న హీరోలకే ఇలాంటి రేర్ ఫీట్ సాధ్యం. అలాంటి అరుదైన రికార్డుని జ్యోతిక సాధించడం విశేషం.



[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: