రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న అత్యంత భారీ బడ్జెట్ సినిమా ఆర్ఆర్ఆర్. రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా ఇద్దరు స్వత్రంత్ర యోధులు అల్లూరి సీతరామ రాజు, కొమరం భీమ్‌లుగా జీవిత చరిత్ర ఆధారంగా ఫిక్షన్ నేపథ్యంలో ఈసినిమా తెరకెక్కుతుండగా ప్రేక్షకుల అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ఈసినిమా తీస్తున్నాడు రాజమౌళి. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, వీడియోస్ ను బట్టి అది అర్థమవుతుంది. ప్రస్తుతం ఫైనల్ షెడ్యూల్ ను మొదలు పెట్టిన ఆర్ఆర్ఆర్ టీం ఉక్రెయిన్ లో షూటింగ్ ను పూర్తి చేసుకోనుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా ఈసినిమా ఇప్పటికే ఈసినిమా సెట్స్ నుండి పలు ఫన్నీ వీడియోలు రాగా ఇప్పుడు తాజాగా ఎన్టీఆర్, రామ్ చరణ్ కు సంబంధించిన మరో వీడియో కూడా వైరల్ అవుతుంది. ఈ వీడియోలో ముందుగా ఎన్టీఆర్ దగ్గరకు వెళ్లి ‘చరణ్ డ్రమ్స్ ప్రాక్టీస్ అయిందా?’ అని ప్రశ్నించగా.. రామచరణ్ తన ముందు ఉన్న టేబుల్‌పైనే వాయించి ‘అయిపోయింది’ అని అంటాడు. ఆ తర్వాత రాజమౌళి కొడుకు కార్తీకేయతో ‘అసలు డ్రమ్స్ ఎక్కడ’ కాస్ట్యూమ్స్ లేవు ఏం లేవు.. కూర్చోబెట్టారు పొద్దున్నే.. దసరాకు రిలీజ్ చేయాలి అనే లోపే వీడియో ఎండ్ అయిపోతుంది. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతోంది.
View this post on Instagram
ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ భామ ‘ఒలివియా మోరిస్’ నటిస్తుంది. ఇక ముఖ్యమైన పాత్రల్లో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్, సముద్రఖని, రే స్టీవెన్సన్, ఆలిసన్ డూడి కూడా నటిస్తున్నారు. ఇక ఈ సినిమాను ఏకంగా పది భాషల్లో రిలీజ్ చేయడానికి భారీ ప్లానే వేస్తున్నాడు రాజమౌళి. డీవీవీ దానయ్య నిర్మిస్తోన్న సినిమా 2021అక్టోబర్ 13న రిలీజ్ కానుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: