విశాల్, ఆర్య హీరోలుగా ఆనంద్ శంకర్ దర్శకత్వంలో ఎనిమి సినిమా వస్తున్న సంగతి తెలిసిందే తెలిసిందే. ఇక షూటింగ్ పూర్తిచేసుకున్న ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది.ఇక ఈసినిమా నుండి ఇప్పుటికే పలు పోస్టర్లతో పాటు టీజర్ ను కూడా రిలీజ్ చేయగా టీజర్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో సాగే ఈ సినిమాని మినీ స్టూడియోస్ పతాకంపై వినోద్ కుమార్ నిర్మిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ చిత్రంతోపాటు శరవణన్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు విశాల్. ‘విశాల్ 31’ వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతోంది. ఈసినిమా కూడా చాలా వరకూ షూటింగ్ ను పూర్తి చేసుకోగా కరోనా వల్ల ఇన్ని రోజులు షూట్ కు బ్రేక్ పడింది. మళ్లీ అందరూ షూటింగ్ లను స్టార్ట్ చేస్తుండటంతో విశాల్ కూడా ఈరోజు తన సినిమా షూటింగ్ ను రీస్టార్ట్ చేశాడు. ఈసినిమా ఫైనల్ షెడ్యూల్ ను నేడు హైద్రాబాద్ లో ప్రారంభించారు. రెండు వారాల పాటు ఇక్కడే ఉండి షూటింగ్ ను పూర్తి చేసుకోనున్నారు.
The final phase shoot of #Vishal31 began today and aiming to complete by mid August. With this the entire filming will be completed.@VishalKOfficial @THUPASARAVANA @thisisysr @VffVishal pic.twitter.com/ceCzty728K
— VamsiShekar (@UrsVamsiShekar) August 5, 2021
ఇక ఈసినిమాను విశాల్ ఫిలిం ఫ్యాక్టరి బేనర్ పై విశాల్ నిర్మిస్తున్నారు. ఈ మూవీకి యంగ్ మ్యాస్ట్రో యువన్ శంకర్‌రాజా సంగీతం అందిస్తుండగా, బాలసుబ్రమణ్యం సినిమాటోగ్రఫీ అందిస్తున్నాడు.
[subscribe]




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: