సినిమా జయాపజయాలతో పనిలేకుండా వరుస సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్నాడు ఆది సాయికుమార్. ప్రస్తుతం ఆది చేతిలో మూడు నాలుగు ప్రాజెక్టులు ఉన్నాయి. హార్రర్ బ్యాక్ డ్రాప్ వస్తున్న జంగిల్ ఈసినిమా ఇప్పటికే లైన్ లో ఉంది. ఈసినిమా తెలుగు, తమిళ్ లో కూడా రూపొందుతుంది. ఇక ఈసినిమాతో పాటు ‘బ్లాక్’ అనే సినిమా కూడా చేస్తున్నాడు. ఈసినిమా కూడా ఎప్పుడో ప్రారంభైంది కూడా. ఇక ప్రస్తుతం ఈసినిమా రిలీజ్ కు సిద్దమవుతుండగా తాజాగా ఈసినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. సుధీర్ బాబు చేతుల మీదుగా టీజర్ ను రిలీజ్ చేశారు. ఇక టీజర్ చూస్తుంటే సినిమా ఆసక్తి పెంచేలా ఉంది. ఓ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రం ఉండేలా అనిపిస్తుంది. అంతే కాకుండా కనిపించని సస్పెన్స్ విలన్ కి హీరోకి నడిచే డ్రామాలా అనిపిస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
Here’s the Official Teaser of #AadiSaiKumar‘s #BLACK 💥
Launched by @isudheerbabu ✌️
▶️: https://t.co/5fmWg0bwzC#GBKrishna #SatishMuthyala #SureshBobbili #MahankaliMovies #MahankaliDiwakar @IamEluruSreenu
— AadiSaikumar (@AadiSaikumar) August 7, 2021
కాగా జె.బి కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈసినిమాలో దర్శన హీరోయిన్ గా నటిస్తుండగా ఆమని, వెన్నెల కిషోర్, ప్రియదర్శి, తాగుబోతు రమేష్ తదితరులు నటిస్తున్నారు. అంతేకాదు బిగ్ బాస్ ఫేమ్ కౌషల్ కూాడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తుంది. మహాంకాళి మూవీస్ బ్యానర్‌పై మహాంకాళి దివాకర్ ఈ సినిమాను నిర్మిస్తుండగా సురేషన్ బొబ్బిలి సంగీతం అందిస్తున్నాడు.
ఇక ఈసినిమాతో పాటు ఆది. ఎస్.బలవీర్ దర్శకత్వంలో మరో సినిమా తెరకెక్కుతుండగా.. ఆది, అవికా గోర్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. అమరన్ అనే టైటిల్ తో రూపొందుతున్న ఈసినిమా ఇటీవలే ప్రారంభమైంది.
[subscribe]




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: