తమిళ , తెలుగు భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో త్రిష తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. త్రిష కథానాయికగా రూపొందిన పలు మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి బెస్ట్ యాక్ట్రెస్ గా అవార్డ్స్ అందుకున్నారు. త్రిష కథానాయికగా రూపొందిన ‘గర్జన “, “సేతురంగ వెట్టై 2”, “రాంగి ” తమిళ మూవీస్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్నాయి. త్రిష ప్రస్తుతం “పొన్నియిన్ సెల్వన్ “(తమిళ ), “రామ్ ” (మలయాళ ) మూవీస్ లో నటిస్తున్నారు. కోలీవుడ్ లో బిజీగా ఉన్న త్రిష ఇప్పుడు ఒక కన్నడ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ “యు టర్న్ ” మూవీ ఫేమ్ పవన్‌కుమార్ దర్శకత్వంలో పునీత్ రాజ్‌కుమార్ కథానాయకుడిగా సైకలాజికల్ థ్రిల్లర్ “ద్విత్వ” కన్నడ మూవీ తెరకెక్కుతుంది. ఈమూవీ లో సీనియర్ హీరోయిన్ త్రిష కథానాయికగా ఎంపిక అయ్యారు. పునీత్ రాజ్ కుమార్ హీరోగా రూపొందిన సూపర్ హిట్ మూవీ “పవర్ “తో త్రిష శాండల్ వుడ్ కు పరిచయం అయ్యారు , పునీత్ రాజ్ కుమార్ హీరోగా రూపొందుతున్న “ద్విత్వ” మూవీ తో 7 సంవత్సరాల తరువాత త్రిష శాండల్ వుడ్ కు రీ ఎంట్రీ కావడం విశేషం.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: