నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో విజయ్ హీరోగా వస్తున్న సినిమా బీస్ట్. ఇటీవలే విజయ్ పుట్టినరోజు సందర్భంగా ఈసినిమా నుండి ఫస్ట్ లుక్ పోస్టర్లు రిలీజ్ చేయగా వాటికి సూపర్ రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ దశలో ఉంది. ఇప్పటికే మొదటి షెడ్యూల్ జార్జియాలో పూర్తి చేసుకుంది. రెండో షెడ్యూల్‌ను కూడా ఇటీవలే మొదలుపెట్టి అది కూడా పూర్తి చేసుకుంది చిత్రయూనిట్. ఇప్పుడు తాజాగా మూడో షెడ్యూల్ ను స్టార్ట్ చేసినట్టు తెలుస్తుంది. నేడు చెన్నైలో ఈసినిమా మూడో షెడ్యూల్ ను స్టార్ట్ చేయగా.. ఈ షెడ్యూల్ ను త్వరగానే పూర్తి చేయనున్నారట.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా ఈ సినిమాలో విజయ్ సరసన పూజా హేగ్డే నటిస్తోంది. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ మూవీని ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ నిర్మిస్తుండగా.. అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇక ఈసినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు.
మరి ఈ ఏడాది మాస్టర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విజయ్ కు ఆ సినిమా మంచి హిట్ అందించింది. వచ్చే ఏడాది ఈ సినిమా విజయ్ కు ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందో చూద్దాం.
[subscribe]




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: