సూపర్ స్టార్ మహేష్ బాబు గారాలపట్టి సితార గురించి స్పెషల్ ఇంట్రడక్షన్ అవసరం లేదు. ఇప్పటికే తను మహేష్ బాబు కూతురిగానే కాకుండా తనకంటూ ప్రత్యేకంగా ఒక యూట్వూబ్ ఛానల్ తో ఇంకా ఫేమస్ అయింది. సోషల్ మీడియాలో కూడా బాగానే యాక్టీవ్ గా ఉంటుంది. ఇక నేడు సితార తన పుట్టినరోజు జరుపుకుంటుంది. ఈ సందర్భంగా ఆమెకు సోషల్ మీడియా ద్వారా మహేష్ ఫ్యాన్స్ విషెస్ అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో మహేష్ కూడా తన ముద్దుల కూతురికి స్పెషల్ విషెస్ చెప్పారు. మై లిటిల్ వన్.. నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. నా ప్రపంచంలో వెలుగులు నింపేది నువ్వే. హ్యాపీ 9! నువ్వు ఊహించిన దానికంటే అమితంగా ప్రేమిస్తున్నా” అని మహేష్ బాబు ట్వీట్ చేశారు. మహేష్ తో పాటు తల్లి నమ్రత, అన్నయ్య గౌతమ్ కూడా సితారకు బర్త్ డే విషెస్ అందించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
Happy birthday, my little one!! Always lighting up my world. Happy 9! ♥️♥️♥️🎂🎂 Love you more than you can imagine! 🤗🤗❤️ #SitaraTurns9 pic.twitter.com/LCx9aP2yew
— Mahesh Babu (@urstrulyMahesh) July 20, 2021
View this post on Instagram
ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరుశురాం దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈసినిమా దుబాయ్ లో ఒక షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం హైద్రాబాద్ లో మరో షెడ్యూల్ జరుపుకుంటుంది. ఈ సినిమాను సూపర్ స్టార్ మహేష్ బాబు ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్, మైత్రీ మూవీ మేకర్స్ లు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
[subscribe]




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: