బ్లాక్ బస్టర్ “ప్రేమకావాలి “మూవీ తో డైలాగ్ కింగ్ సాయి కుమార్ తనయుడు ఆది సాయికుమార్ టాలీవుడ్ కు హీరోగా పరిచయం అయ్యారు. ఆ మూవీ లో ఆది అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. “లవ్లీ “, రఫ్ “, చుట్టాలబ్బాయి “, ఆపరేషన్ గోల్డ్ ఫిష్ “వంటి మూవీస్ తో హీరో ఆది ప్రేక్షకులను అలరించారు. హీరో ఆది ప్రస్తుతం తెలుగు , తమిళ భాషలలో రూపొందుతున్న “జంగిల్ “, “కిరాతక “, “అమరన్ ” “బ్లాక్ ” మూవీస్ లో కథానాయకుడిగా నటిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఎస్ వి ఆర్ నిర్మాతగా ఎస్.బలవీర్ దర్శకత్వంలో ఆది హీరోగా సరి కొత్త కథా నేపథ్యంతో “అమరన్” మూవీ రూపొందుతుంది. హీరో ఆది పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్న ఈ చిత్రంలో అవికా గోర్ కథానాయిక. సాయి కుమార్, ఆదిత్య ఓం, కృష్ణుడు, మనోజ్ నందన్, వీర శంకర్, అయన్, శృతి, రోషన్, మధు మణి ముఖ్యపాత్రాలలో నటిస్తున్నారు. కృష్ణ చైతన్య సంగీతం అందిస్తున్నారు. ఆది సాయి కుమార్ కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న “అమరన్ ఇన్ ది సిటీ-చాప్టర్ 1″మూవీ షూటింగ్ భారీ బడ్జెట్‌తో నిర్మించిన పోలీస్ స్టేషన్ సెట్‌లో జరుగుతుంది. చిత్ర యూనిట్ హీరో ఆది న్యూ లుక్ ను రిలీజ్ చేయగా ప్రేక్షకులను ఆకట్టుకుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: