తెలుగు హీరోలు ఇప్పుడు తమిళ డైరెక్టర్స్ తో కూడా సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్న సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలోనే రామ్ పోతినేని హీరోగా లింగుసామి దర్శకత్వంలో ఓ సినిమా వస్తున్న సంగతి కూాడా విదితమే. మరి ఇలాంటి క్రేజీ కాంబినేషన్ లో సినిమా అంటే అందరికీ ఆసక్తి ఉంటుంది కదా. అందుకే రోజుకో ఇంట్రెస్టింగ్ న్యూస్ తెరపైకి వస్తూనే ఉంటుంది. ఇప్పటికే ఈసినిమాలో రామ్ కు విలన్ గా పోటీ ఇవ్వడానికి పలుపేర్లు వినిపించాయి. ఆమధ్య మాధవన్ అన్నారు. తను ఈసినిమాలో నటించడంలేదని క్లారిటీ ఇవ్వడంతో వార్తలకు ఫుల్ స్టాప్ పడింది. ఈ మధ్య ఆర్యన్ అన్నారు. ఇప్పుడు తాజాగా మరో పేరు వినిపిస్తుంది. ఆహీరో ఎవరో కాదు అటు తమిళ్ తోపాటు, తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడైన ఆది పినిశెట్టి. ఈసినిమాలో పవర్ ఫుల్ విలన్ పాత్రలో ఆది నటించనున్నట్టు వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. అంతేకాదు దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా త్వరలోనే రానుందని అంటున్నారు. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే మాత్రం అధికారిక ప్రకటన వచ్చేంత వరకూ ఆగాల్సిందే. కాగా గతంలో ఆది సరైనోడు సినిమాలో విలన్ గా నటించిన సంగతి తెలిసిందే. విలన్ గా కూడా ఆది తన నటనతో ఆకట్టుకున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈసినిమాలో నదియా కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై నిర్మాత శ్రీనివాస్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో, హై టెక్నికల్ వాల్యూస్‌తో తెలుగు, తమిళ భాషల్లో ప్రెస్టీజియస్‌గా తెరకెక్కించనున్నారు. ఈసినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ప్రస్తుతం ఈసినిమా హైద్రాబాద్ లోనే షూటింగ్ ను జరుపుకుంటుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: