మాస్ మహారాజా రవితేజ సూపర్ స్పీడు మీదున్నాడు. క్రాక్ చిత్రం బ్లాక్ బస్టర్ అవ్వడంతో మళ్లీ ఫామ్ లోకి వచ్చిన రవితేజ.. అదే ఎనర్జీతో వరుసగా సినిమాలను లైన్ లో పెడుతున్నాడు. ఇప్పటికే రమేష్ వర్మతో ఖిలాడి సినిమా చేస్తున్నాడు. ఈసినిమా షూటింగ్ కూడా పూర్తవుతుంది. మరో వైపు ఇంకో కొత్త ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించాడు. RT68గా మొదలుపెట్టిన ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు ఫుల్ స్వింగ్‌లో ఉంది. సెకండ్ వేవ్ తరువాత మొదలుపెట్టిన ఈ మూవీ షూటింగ్ జెట్ స్పీడ్‌లో జరుగుతోంది. ఇక ఈరోజు ఈసినిమా ఫస్ట్ లుక్ అండ్ టైటిల్‌ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ప్రభుత్వ ఉద్యోగి రామారావుగా రవితేజ ఈసినిమాలో కనిపించబోతున్నాడు. ఫస్ట్ లుక్, టైటిల్ అయితే ఇప్పటికే సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. దీంతో సినిమాపై కూడా అంచనాలు పెరిగిపోయాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
His soul so brave and pure
Does he obey
Does he violate
One shall never knowLet me introduce you ..
Mr Rama Rao ! #RT68 is #RamaRaoOnDuty @RaviTeja_offl @itsdivyanshak @sathyaDP @sahisuresh @Cinemainmygenes @SamCSmusic @SLVCinemasOffl @RTTeamWorks pic.twitter.com/U1iFLOhfIX— Sarath (@directorsarat) July 12, 2021
కాగా శరత్ మండవ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈసినిమాలో దివ్యాంశ కౌశిక్ హీరోయిన్‌గా నటిస్తుంది. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై చెరుకూరి సుధాకర్ నిర్మిస్తోన్నఈసినిమాకు శ్యామ్ సీఎస్ సంగీతం అందిస్తుండగా సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రాఫర్‌గా వర్క్ చేస్తున్నారు. ఈసినిమా షూటింగ్ ను త్వరలోనే పూర్తిచేసి రిలీజ్ చేయడానికిి ప్లాన్ చేస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: