సినిమాల రిలీజ్ ల సంగతి పక్కన పెడితే హీరోలు మాత్రం ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా వరుస సినిమాలను చేసుకుంటూ వెళుతున్నారు. ఒక సినిమా షూటింగ్ దశలో ఉండగానే మరోసినమాను లైన్ లో పెడుతున్నారు. ఇక కళ్యాణ్ రామ్ కూడా అదే పని చేస్తున్నాడు. ఇప్పటికే కళ్యాణ్ రామ్ నూతన దర్శకుడు మల్లిడి వశిష్టతో కలిసి బింబిసార సినిమాను చేస్తున్నాడు. ఈసినిమా పెద్ద హడావుడి లేకుండానే స్టార్ట్ అయి షూటింగ్ కూడా పూర్తి చేసుకుంటుంది. పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో ఈసినిమా తెరకెక్కుతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పుడు మరో కొత్త సినిమాను తన లిస్ట్ లో చేర్చాడు. నేడు కళ్యాణ్ రామ్ పుట్టినరోజు ఈ సందర్భంగా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. కె.వి గుహన్ దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ 20 వ సినిమా రాబోతున్నట్టు అనౌన్స్ మెంట్ ఇచ్చారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ లో దిల్ రాజు ఈసినిమాను నిర్మిస్తున్నాడు. మరి కళ్యాణ్‌రామ్, గుహన్ కాంబినేషన్‌లో రూపొందిన సస్పెన్స్ థ్రిల్లర్ ‘118’ సూపర్ డూపర్ హిట్టయిన సంగతి తెలిసిందే. పటాస్ తరువాత చాలా కాలం ఫ్లాప్స్ తో సతమతమైన కళ్యాణ్ రామ్ కు 118 సినిమానే హిట్ ఇచ్చింది. మరి ఇప్పుడు మరో డిఫరెంట్ స్టోరీని కళ్యాణ్ రామ్ కోసం రెడీ చేశాడు కె.వి.గుహన్ మరి ఈసినిమా కళ్యాణ్ రామ్ కు ఎంత సక్సెస్ అందిస్తుందో చూడాలి… ఈ సినిమాలోని ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులు గురించి త్వరలోనే తెలియచేయనున్నారు.
Wishing @NandamuriKalyan a very Happy Birthday!
Happy to announce our film with him. We are bringing back the hit combination of @NandamuriKalyan & @KVGuhan with #NKR20
More updates soon.@SVC_Official#HappyBirthdayNKR pic.twitter.com/sQO312BQzd— Sri Venkateswara Creations (@SVC_official) July 5, 2021
దీనితో పాటు బాబు బాగా బిజీ ఫేమ్ నవీన్ మేడారం డైరెక్టర్ తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. దీనితో పాటు రాజేంద్ర దర్శకుడిగా పరిచయం అవుతూ మరో సినిమాను కూడా చేస్తున్నాడు. ఇది ఇటీవలే ప్రారంభమైంది. మరి వీటిలో ఏ సినిమా ముందు రిలీజ్ అవుతుందో చూడాలి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: