వరస బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షక , అభిమానులను అలరిస్తూ టాలీవుడ్ లో సూపర్ స్టార్ గా కొనసాగుతున్న మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ “సర్కారు వారి పాట “మూవీ లో నటిస్తున్నారు. ఈ మూవీ తో పాటు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో “SSMB 28 “, అనిల్ రావిపూడి , రాజమౌళి మూవీస్ కు మహేష్ బాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
మైత్రీ మూవీ మేకర్స్ , 14 రీల్స్ ప్లస్ , జి ఎమ్ బి ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై పరశురామ్ దర్శకత్వంలో మహేష్ బాబు , కీర్తి సురేష్ జంటగా తెరకెక్కుతున్న “సర్కారు వారి పాట ” మూవీ ఒక షూటింగ్ షెడ్యూల్ ను దుబాయ్ లో కంప్లీట్ చేసుకుంది. దుబాయ్ షెడ్యూల్ లో కొన్ని యాక్షన్ సన్నివేశాలను దర్శకుడు తెరకెక్కించారు. రెండవ షెడ్యూల్ ప్రారంభించగానే కోవిడ్ సెకండ్ వేవ్ పరిస్థితుల కారణంగా ఈ సినిమా షూటింగ్‌కి బ్రేక్ పడింది. “సర్కారు వారి పాట ” మూవీ తాజా షెడ్యూల్ ఈ నెల 15న హైదరాబాద్‌లో ప్రారంభం కానుందనీ , షూటింగ్ పార్ట్ ను సెప్టెంబరు నెలలో పూర్తి చేయాలనే టార్గెట్‌ను కూడా ఫిక్స్ చేసుకున్నారనీ సమాచారం. “సర్కారువారి పాట” మూవీ 2022సంవత్సరం సంక్రాంతికి విడుదల కానుంది.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: