మెగాస్టార్ చిరు- తనయుడు రామ్ చరణ్ ఇద్దరూ కలిసి వస్తున్న సినిమా ఆచార్య. పరిస్థితులు అన్నీ బావుంటే ఇప్పటికే ఈసినిమా రిలీజ్ అయి ఉండేది. చిరును చరణ్ ను ఒకే స్క్రన్ పై చూడాలన్న మెగాఫ్యాన్స్ కోరిక కూడా తీరిపోయేది. కానీ కరోనా వల్ల షూటింగ్ కు బ్రేక్ పడింది. ఇక ఈసినిమా షూటింగ్ కూడా దాదాపు అయిపోయింది. రెండు మూడు వారాలు అయితే ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది. ఈ గ్యాప్ లో పోస్ట్ ప్రొడక్షన్ పనులు కానిచ్చేస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా ఈసినిమా తరువాత చిరంజీవి లూసిఫర్ సినిమాను చేయనున్న సంగతి తెలిసిందే కదా. అయితే మధ్యలో మెహర్ రమేష్ సినిమా షూటింగ్ మొదలు పెట్టారన్న వార్తలు కూడా వచ్చాయి. కానీ చిరు మొదట లూసిఫర్ సినిమా చేయడానికి ఫిక్స్అయ్యాడట. అంతేకాదు ఆచార్య షూటింగ్ కూడా ఎలాగూ తొందరగానే అయిపోతుంది కాబట్టి ఈగ్యాప్ లో లూసిఫర్ ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకోవాల్సిందిగా మేకర్స్ ను సూచించారట చిరు. మరి ఆచార్య అయిపోయిన వెంటనే లూసిఫర్ సెట్స్ పైకి వెళుతుందన్నమాట.
కాగా ఈ సినిమా దేవాలయ భూముల ఆక్రమణకి సంబంధించిన అంశం నేపథ్యంలో ఉండబోతుందని తెలుస్తుంది. కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. సిద్ధ అనే విద్యార్థి నాయకుడు పాత్రను పోషిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.
[subscribe]




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: