మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం రమేష్‌వర్మ దర్శకత్వంలో ఖిలాడి సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, ఫస్ట్ గ్లిమ్స్, టీజర్ మంచి స్పందన తెచ్చుకోవడమే కాకుండా.. ఇదొక హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ అనే విషయాన్ని స్పష్టం చేసాయి. ఇక కరోనా సెకండ్ వేవ్ కు ముందే ఈసినిమా ఇటలీలో షూటింగ్ జరుపుకున్న సంగతి తెలిసిందే కదా. అక్కడ కొన్ని కీలక సన్ని వేశాలతో పాటు భారీ యాక్షన్ సీక్వెన్సెస్ కూడా చిత్రీకరించారు. ఈనేపథ్యంలో నేడు తాజాగా ‘ఖిలాడి’ ఇటలీ షెడ్యూల్ లో షూట్ చేసిన యాక్షన్ సీన్ కు సంబంధించిన ఓ చిన్న వీడియో క్లిప్ ను చిత్ర బృందం సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇందులో రవితేజ బైక్ ఛేజింగ్ సీక్వెన్స్ కనిపిస్తుంది. అంతేకాదు హాలీవుడ్ స్థాయిలో ఈ యాక్షన్ సీక్వెన్స్ ను షూట్ చేసినట్టు కూడా అనిపిస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
BTS Memories 🌤️🏍️#Khiladi ITALY Chase Sequence 🔥 pic.twitter.com/WUuyq1hJBa
— #Khiladi (PLAY SMART) (@KHILADiOffl) June 18, 2021
కాగా యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమాలో రవితేజ డ్యూయల్ రోల్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇంకా ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటిస్తుండగా యాక్షన్ కింగ్ అర్జున్.. మలయాళ హీరో ఉన్ని ముకుందన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఏ స్టూడియోస్, పెన్ స్టూడియోస్ పతాకాలపై జయంతీలాల్ గద సమర్పణలో కోనేరు సత్యనారాయణ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా.. ‘లూసిఫర్’ ఫేమ్ సుజిత్ వాసుదేవ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: