రవీంద్ర పుల్లె దర్శకత్వంలో కార్తీక్ రత్నం, నవీన్ చంద్ర, కృష్ణ ప్రియ కీలక పాత్రల్లో రూపొందిన సినిమా ‘అర్ద శతాబ్దం’. నిజానికి ఈసినిమా కూడా ఎప్పుడో రిలీజ్ కావాల్సింది కానీ కరోనా వల్ల ఎప్పటికప్పుడు వాయిదా పడింది. ఫైనల్ గా ఓటీటీలో రిలీజ్ చేశారు. ప్రముఖ డిజిటల్ ఫ్లాట్ ఫామ్ ఆహా
లో ఈసినిమా రిలీజ్ అయింది. మరిఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈసినిమా ఆ అంచనాలను రీచ్ అయిందో లేదో చూద్దాం..
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
నటీనటులు : కార్తీక్ రత్నం, కృష్ణ ప్రియ, నవీన్ చంద్ర, సాయికుమార్, శుభలేఖ సుధాకర్ ఆమని.. దర్శకత్వం : రవీంద్ర పుల్లె
బ్యానర్ : రిషితా శ్రీ క్రియేషన్స్ ఎల్‌ఎల్‌పీ, 24 ఫ్రేమ్స్ సెల్యూలాయిడ్
నిర్మాతలు: చిట్టి కిరణ్ రామోజు, తేలు రాధాకృష్ణ
సంగీతం : నోఫెల్ రాజా
కథ
సిరిసిల‍్ల గ్రామానికి చెందిన కృష్ణ (కార్తీక్ రత్నం) చదువు పూర్తి చేసుకొని అదే ఊరిలో ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తుంటాడు. ఎప్పటికైనా దుబాయ్ వెళ్లి బాగా సంపాదించి, తల్లిని, చెల్లిని బాగా చూసుకోవాలని అతని కోరిక. ఆయనకు అదే గ్రామానికి చెందిన మాజీ నక్సలైట్ రామన్న(సాయికుమార్) కూతురు పుష్పని(కృష్ణ ప్రియ) చిన్నప్పటి నుండి ప్రేమిస్తాడు. ఇదిలా ఉండగా కృష్ణ చేసిన ఓ పని ఊర్లో గొడవలకు దారి తీస్తుంది. ఆ తప్పుతో ఊరి మొత్తం కులాల పేరుతో ఒకరినొకరు చంపుకునే పరిస్థితి వస్తుంది.అసలు కృష్ణ చేసిన పని ఏంటి? దాని వల్ల ఆ ఊళ్లో ఎలాంటి దారుణ పరిస్థితులు ఎదురయ్యాయి? వీరి ప్రేమకి కులాల మధ్య కుమ్ములాటకి సంబంధం ఏంటి? చివరకు పుష్ప ప్రేమని కృష్ణ పొందాడా లేదా? అనేదే మిగతా కథ.
విశ్లేషణ..
కుల వివక్షత, గొడవలు ఈ బ్యాక్ డ్రాప్ లో ఎన్నో సినిమాలు వచ్చాయి. ఈసినిమా కూడా అలాంటి బ్యాక్ డ్రాప్ లో వచ్చిన కథనే. నిజానికి కమర్షియల్ సినిమాలు చేయాలంటే ఆలోచించాల్సిన అవసరం లేదు. కానీ ఇలాంటి సున్నితమైన కథను ఎంచుకున్నప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా సినిమా తీయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఏ కొంచం తేడా కొట్టినా కూడా వివాదలు తలెత్తే అవకాశం ఉంది. ఏ విషయాన్ని చెప్పాలనుకుంటున్నామో.. దానిని బలంగా తెరపై చూపించాలి. ఆయా సన్నివేశాలు ప్రేక్షకుడి భావోద్వేగాల్ని తట్టిలేపాలి. అప్పుడే సినిమా సక్సెస్ అవుతుంది. ఇక ఈవిషయంలో డైరెక్టర్ బాగానే కేర్ తీసుకున్నట్టు కనిపిస్తుంది. కుల వ్యవస్థ, వర్గ పోరాటం, రాజ్యాంగం.. అంటూ బలమైన విషయాల్నే ఎంచుకొని వాటిని డీల్ చేయడంలో సక్సెస్ అయ్యాడు. ఫస్టాఫ్ అంతా కృష్ణ ప్రేమ చుట్టే తిరుగుతుంది. ఇక సెకండాఫ్‌లో కథ సీరియస్ టర్న్ తీసుకుంటుంది.
ఇక కేరాఫ్ కంచరపాలెం’లో జోసెఫ్‌గా నటించి ఆకట్టుకున్న కార్తీక్ రత్నం ఇందులోనూ తనదైన నటనతో మెప్పించాడు. మధ్యతరగతి కుటుంబానికి చెందిన యువకుడు కృష్ణ పాత్రలో ఒదిగిపోయాడు. ఒక హీరోగా కాకుండా, విలేజ్‌కి చెందిన అబ్బాయిగా చాలా సహజంగా తన పాత్ర సాగుతోంది. లవర్ బాయ్‌గా జోష్‌గా కనిపిస్తూ.. బావోధ్వేగ నటనను ప్రదర్శించాడు. ఇక పల్లెటూరికి చెందిన పుష్ప పాత్రకు పూర్తి న్యాయం చేసింది కృష్ణప్రియ. సంప్రదాయ దుస్తుల్లో తెరపై అందంగా కనిపించింది. మాజీ నక్సలైట్ రామన్నగా సాయికుమార్ తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. వ్యవస్థపై చిరాకు పడే ఎస్సై రంజిత్‌గా నవీన్ చంద్ర పర్వాలేదనిపించాడు. ఆమని, శుభలేఖ సుధాకర్ తదితరులు తమ పాత్రల పరిధిమేరకు నటించారు.
ఈ సినిమాకు ప్రధాన బలం నోఫెల్ రాజా సంగీతం. నేపథ్య సంగీతం బాగుంది. అస్కర్, వెంకట్, ఈజే వేణుల సినిమాటోగ్రఫీ బాగుంది. పల్లె అందాలను, ప్రేమ సన్నివేశాలను చక్కగా చూపించారు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.
ఓవరాల్ గా ప్రేమ కథలను, డిఫరెంట్ స్టోరీస్ ను ఇష్టపడే వాళ్లకు ఈసినిమా తప్పకుండా నచ్చుతుంది.
[subscribe]




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: