అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన ‘అల వైకుంఠపురములో’ సినిమా ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయిందో చెప్పనక్కర్లేదు. అంతేకాదు బన్నీ కెరియర్ లోనే ఈ సినిమా అత్యధిక కలెక్షన్స్ సొంతం చేసుకొని కెరీర్ బెస్ట్ సినిమాగా నిలిచింది. త్రివిక్రమ్ స్టైల్ డైలాగ్స్, బన్నీ కామెడీ టైమింగ్, పూజ గ్లామర్, థమన్ సాంగ్స్ అన్నీ ఈ సినిమాకు బాగా కలిసొచ్చాయి. ఇక ఈసినిమా రిలీజ్ అయి ఏడాదిన్నర అవుతున్నా ఏదో ఒకరకంగా అవార్డులు, రికార్డులు క్రియేట్ చేస్తూనే ఉంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా ఈసినిమాను బాలీవుడ్ లో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే కదా. మొదట ఈ సినిమాని బాలీవుడ్ లవర్ బాయ్ రణబీర్ కపూర్ తో తెరకెక్కించాలని ప్లాన్ చేశారు. కానీ అది వర్కవుట్ కాలేదు. ఇప్పుడు కార్తీక్ ఆర్యన్ హీరోగా ఫిక్స్ అయ్యాడు. నటుడు వరుణ్ ధావన్ సోదరుడు రోహిత్ ధావన్ ఈ రీమేక్‌కి దర్శకత్వం వహించనున్నారు. ఇక ఈసినిమాలో హీరోయిన్ గా మొదటి నుండి కృతీ సనన్ పేరే వినిపిస్తుంది. ఇప్పుడు కృతీ సనన్ ఖరారైనట్టు తెలుస్తుంది.
ఈ మూవీ హిందీ రీమేక్ హక్కులను బాలీవుడ్ ప్రముఖ ప్రొడ్యూసర్ అశ్విన్ వర్దే దక్కించుకున్న సంగతి తెలిసిందే. అశ్విన్ గత ఏడాది షాహిద్ కపూర్ తో అర్జున్ రెడ్డి హిందీ రీమేక్ కబీర్ సింగ్ తెరకెక్కించగా భారీ విజయం అందుకుంది. మరి ఈ సినిమా తో మళ్ళీ హిట్ కొడతాడేమో..? అల వైకుంఠపురములో అక్కడ ఎలాంటి సంచలనం సృష్టించబోతుందో..? చూడాలి.
[subscribe]



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: