‘ఉగ్రం’ అనే సూపర్ హిట్ మూవీతో కన్నడ పరిశ్రమలో అరంగేట్రం చేశాడు దర్శకుడుప్రశాంత్ నీల్. అయితే కె.జి.యఫ్ తీసుకొచ్చినంత గుర్తింపు మరే సినిమా తీసుకురాలేదు. దేశవ్యాప్తంగా ఒక్క సారిగాకె.జి.యఫ్ తో టాక్ ఆఫ్ ద టౌన్ అయ్యాడు. ఇప్పుడు అదే జోష్ తో కె.జి.యఫ్ తీస్తున్నాడు. అంతేకాదు పాన్ ఇండియా డైరెక్టర్ గా ఇప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోలందరినీ లైన్ లో పెడుతూ పాన్ ఇండియా సినిమాలకు తెరకెక్కించడానికి ప్లాన్ చేస్తున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక నేడు ప్రశాంత్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా అతడితో ‘కేజీఎఫ్’.. ‘సలార్’ చిత్రాలు నిర్మిస్తున్న హోంబలె ఫిలిమ్స్ ఒక ట్రిబ్యూట్ వీడియోను రూపొందించింది. ‘కేజీఎఫ్’ మేకింగ్ సందర్భంగా ప్రశాంత్ తన టీం కలిసి పని చేసే వీడియో ఇది. కన్నడ నేల నుంచి పుట్టిన ఈ దర్శకుడు.. ‘ది బెస్ట్’ అనిపించుకున్నాడని.. తన టీంలో ప్రతి ఒక్కరి నుంచి ‘ది బెస్ట్’ రాబడతాడని అతడికి ఎలివేషన్ ఇస్తూ ఈ వీడియో సాగింది.
A man of few words but a captain who takes his team along to heights 🤩
Wishing our dearest @prashanth_neel a very Happy Birthday 🎉
A Surprise Glimpse: https://t.co/CYzI9CElBs
Can’t wait to celebrate #KGFChapter2 #Salaar on the big screen.#HBDPrashanthNeel pic.twitter.com/ixL9Mp4vBm
— Hombale Films (@hombalefilms) June 4, 2021
ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన కె.జి.యఫ్ 2 రిలీజ్ కు సిద్దంగా ఉంది. ఇంకా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో సలార్ సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ దశలో ఉంది. ఇంకా ఎన్టీఆర్ తో ఇటీవలే ఒక సినిమా చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు. అంతేకాదు వీరితో కాకుండా ఇంకా బన్నీతో, చరణ్ తో కూడా సినిమాలు చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: