తెలుగు చలన చిత్ర పరిశ్రమలో నటుడు , నిర్మాత , దర్శకుడిగా పలు రికార్డ్స్ క్రియేట్ చేసి సూపర్ స్టార్ కృష్ణ ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. లెజెండరీ యాక్టర్ కృష్ణ ఈ రోజు (మే 31 ) తన పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. సూపర్ స్టార్ కృష్ణ అభిమానులు నిన్నటి నుండే తమ అభిమాన హీరో కు సోషల్ మీడియా ద్వారా బర్త్ డే శుభాకాంక్షలు అందజేస్తున్నారు. సూపర్ స్టార్ కృష్ణ తనయుడు మహేష్ బాబు తన స్పెషల్ విషెస్ ను తెలిపారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
Happy birthday Nanna.. Thank you for always showing me the best way forward.. Love you more than you’ll ever know ♥️♥️♥️ pic.twitter.com/Mm3J0OA8by
— Mahesh Babu (@urstrulyMahesh) May 30, 2021
జన్మదిన శుభాకాంక్షలు నాన్న, నాకు ఎప్పుడూ ఉన్నతమైన దారినే చూపిస్తున్న మీకు థాంక్స్ తెలియజేస్తున్నాను. మీకు తెలిసిన దానికంటే ఎక్కువే నా ప్రేమ మీ మీద ఉంటుంది” అంటూ మహేష్ బాబు తన స్పెషల్ విషెష్ ను సోషల్ మీడియా ద్వారా తెలిపారు. మహేష్ బాబు ప్రస్తుతం యాక్షన్ ఎంటర్ టైనర్ “సర్కారు వారి పాట “మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందే “#SSMB 28 “మూవీ కి మహేష్ బాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
[subscribe]




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: