అడివి శేష్ : సూపర్ హిట్ మిస్టరీ థ్రిల్లర్ “క్షణం “మూవీ తో అడివి శేష్ హీరోగా పరిచయం అయ్యారు . “క్షణం “మూవీ కి స్క్రీన్ ప్లే అందించిన అడివి శేష్ బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్ గా నంది అవార్డు అందుకున్నారు. “గూఢచారి “, “ఎవరు ” వంటి సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ అడివి శేష్ టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ రైటర్ , హీరోగా కొనసాగుతున్నారు. అడివి శేష్ హీరోగా తెలుగు , హిందీ భాషలలో రూపొందిన “మేజర్ “ మూవీ కరోనా సెకండ్ వేవ్ కారణంగా విడుదల వాయిదా పడింది.హీరో అడివి శేష్ ప్రస్తుతం “HIT 2-సెకండ్ కేస్” , “గూఢచారి 2” మూవీస్ లో నటిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: ![👇](https://s.w.org/images/core/emoji/11/svg/1f447.svg)
లేటెస్ట్ తెలుగు మూవీస్
విశ్వక్ సేన్: “వెళ్ళిపోమాకే “మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన విశ్వక్ సేన్ “ఈ నగరానికి ఏమైంది ?” మూవీ తో గుర్తింపు పొందారు. సూపర్ హిట్ “ఫలక్ నుమా దాస్” తో విశ్వక్ దర్శకుడిగా మారారు. సూపర్ హిట్ మిస్టరీ యాక్షన్ థ్రిల్లర్ “HIT -ది ఫస్ట్ కేస్ “ మూవీ లో పోలీస్ ఆఫీసర్ గా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి విశ్వక్ ప్రేక్షకులను అలరించారు. వరస హిట్ మూవీస్ తో టాలీవుడ్ లో విశ్వక్ సేన్ సక్సెస్ ఫుల్ హీరోగా దూసుకుపోతున్నారు.విశ్వక్ సేన్ హీరోగా రూపొందిన “పాగల్ ” మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. విశ్వక్ సేన్ హీరోగా “అశోకవనంలో అర్జున కళ్యాణం “మూవీ తెరకెక్కనుంది.
నవీన్ పోలిశెట్టి : సివిల్ ఇంజనీర్ , థియేటర్ ఆర్టిస్ట్ నవీన్ పోలిశెట్టి “లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ “మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. సూపర్ హిట్”ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ “మూవీ తో హీరోగా మారి ప్రేక్షకులను అలరించారు. బ్లాక్ బస్టర్ “చిచ్చోరే “మూవీ తో నవీన్ బాలీవుడ్ కు పరిచయం అయ్యారు. కామెడీ ఎంటర్ టైనర్ బ్లాక్ బస్టర్ “జాతిరత్నాలు “మూవీ తో ప్రేక్షకులను ఆకట్టుకుని నవీన్ టాలీవుడ్ లో క్రేజీ హీరోగా మారారు.“జాతిరత్నాలు“మూవీ తో హ్యాట్రిక్ సాధించిన నవీన్ టాలీవుడ్ లో పలు మూవీ అవకాశాలు అందుకుంటున్నారు .స్టార్ హీరోయిన్ అనుష్క మూవీ లో నవీన్ నటిస్తున్నట్టు సమాచారం.
వైష్ణవ్ తేజ్: హీరో సాయి ధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ బ్లాక్ బస్టర్ “ఉప్పెన “మూవీ తో టాలీవుడ్ కు హీరోగా పరిచయం అయ్యారు.“ఉప్పెన “మూవీ ఘనవిజయం సాధించి 100కోట్ల క్లబ్ లో చేరింది. దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ , రకుల్ ప్రీత్ సింగ్ జంటగా గ్రామీణ నేపథ్యంలో రూపొందిన మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. మనం ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై నూతన దర్శకుడి దర్శకత్వంలో ఒక మూవీ, ప్రముఖ నిర్మాత బివి ఎస్ ఎన్ ప్రసాద్ నిర్మించే మూవీ కి వైష్ణవ్ తేజ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వరస మూవీస్ తో యంగ్ హీరో వైష్ణవ్ తేజ్ టాలీవుడ్ లో బిజీగా మారారు.
[totalpoll id=”61317″]
![Video thumbnail](https://img.youtube.com/vi/On6ZQhjAHmU/default.jpg)
![Video thumbnail](https://img.youtube.com/vi/CQ_7dQbA-HY/default.jpg)
![Video thumbnail](https://img.youtube.com/vi/ponx6jXW6gw/default.jpg)
![Video thumbnail](https://img.youtube.com/vi/yPQ1iydVQ-w/default.jpg)
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:![👇](https://s.w.org/images/core/emoji/11/svg/1f447.svg)