మల్టీ టాలెంటెడ్ యాక్ట్రెస్ శృతి హాసన్ ప్రస్తుతం బ్లాక్ బస్టర్ “కె జి ఎఫ్ చాప్టర్ 1 “మూవీ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా భారీ బడ్జెట్ తో రూపొందుతున్నయాక్షన్ ఎంటర్ టైనర్ “సలార్ “మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు. శృతి కథానాయికగా నటించిన “క్రాక్ “, “వకీల్ సాబ్ “మూవీస్ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. శృతి హాసన్. స్టార్ హీరో విజయ్ సేతుపతి కి శృతి జోడీగా నటించిన “లాభం “తమిళ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ శృతి తన ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్న విషయం తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రస్తుతం ఉన్న కోవిడ్ సంక్షోభంలో ఒకరికొకరు సాయం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని శృతి హాసన్అంటున్నారు. ప్రజలు భయాందోళనలతో సతమతమవుతున్నారనీ , కొవిడ్ బాధితులకు, కొవిడ్ నుంచి కోలుకున్నవారికి మన మంచి మాటలతో ధైర్యాన్ని నింపడం కూడా సాయమే అవుతుందనీ , కరోనా ఫస్ట్ వేవ్ సమయంలో ఉన్న పరిస్థితులకీ, కొవిడ్ సెకండ్ వేవ్ వల్ల ఏర్పడిన పరిస్థితులకీ తేడా ఉందనీ , ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా ఫీలై ఒకొరికొకరం సాయం చేసుకోవాల్సిన తరుణం ఇదనీ , కొవిడ్ సహాయ సమాచారాలను సోషల్ మీడియా ద్వారా తెలుసుకోగలుగుతున్నామనీ , సోషల్ మీడియా లో తప్పుడు సమాచారాన్ని పోస్ట్ చేయకూడదనీ , తన వరకు కరెక్ట్ వివరాలనే షేర్ చేయడానికే ప్రయత్నిస్తాననీ శృతి చెప్పారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: