రేపు ఉగాది పండుగ సందర్భంగా పలు సినిమాలకు సంబంధించిన అప్ డేట్స్ ను రెడీగా పెట్టుకున్నారు దర్శక నిర్మాతలు. ఇప్పటికే బాలయ్య-బోయపాటి సినిమా టైటిల్ రిలీజ్ టైమ్ ను ఫిక్స్ చేశారు. మరోవైపు నేడు మేజర్ టీజర్, ఎన్టీఆర్ సినిమాల అప్ డేట్స్ ఇవ్వనున్నారు. ఈనేపథ్యంలో రేపు నారప్ప నుండి కూడా సర్ ప్రైజ్ ప్లాన్ చేశారు. రేపు ఉదయం 10 గంటల 8 నిమిషాలకు నారప్ప నుండి సర్ ప్రైజ్ ఇవ్వనున్నట్టు నారప్ప మేకర్స్ సురేష్ ప్రొడక్షన్స్ తన ట్విట్టర్ ద్వారా తెలిపింది. మరి ఇప్పటి వరకూ పోస్టర్లు.. చిన్న గ్లింప్స్ వదిలారు కానీ టీజర్ లాంటివి రిలీజ్ చేయలేదు. మరి టీజర్ కు సంబంధించి ఏదైనా అప్ డేట్ ఇస్తారా.. లేకపోతే పోస్టరే రిలీజ్ చేస్తారా చూడాలి..
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
Celebrate the spirit of Ugadi with #Narappa tomorrow at 10:08 am ❤️
A little suprise…Stay tuned !! @VenkyMama #Priyamani #SrikanthAddala #Manisharma @theVcreations— Suresh Productions (@SureshProdns) April 12, 2021
శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో హీరో వెంకటేష్ ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా నారప్ప. తమిళ్ లో సూపర్ హిట్ అయిన అసురన్ సినిమా రీమేక్ ఇది. ఇప్పటికే ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది.
కాగా ప్రియమణి ఈ సినిమాలో సుందరమ్మగా నటిస్తుంది. కేరాఫ్ కంచరపాలెం ఫేం కార్తీక్ రత్నం కీలక పాత్రలో నటిస్తున్నాడు. నారప్ప పెద్ద కొడుకు మునికన్నా పాత్రలో కార్తీక్ రత్నం నటిస్తున్నాడు. ఇంకా ఈ సినిమాలో ప్రకాశ్ రాజ్, మురళీ శర్మ కీలక పాత్రలు పోషిస్తున్నారు. సురేష్ ప్రొడక్షన్స్, వి క్రియేషన్స్ సంస్థల్లో సురేష్ బాబు, కళైపులి ఎస్ థాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. సమ్మర్ స్పెషల్‌గా మే 14 ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: