కోబ్రా రిలీజ్ పై నిర్మాతల క్లారిటీ – థియేటర్ లోనే

Cobra Movie Producer Quashes Rumors Of Releasing Movie On OTT Platform,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Cobra,Cobra Movie,Cobra Telugu Movie,Cobra Movie Updates,Cobra Telugu Movie Latest News,Cobra Movie Live Updates,Cobra Movie Breaking News

గత కొన్నేళ్లుగా తమిళ్ స్టార్ హీరో విక్రమ్ కు కూడా సరైన హిట్ దక్కలేదు. ఇక ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలన్న నేపథ్యంలో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 20కు పైగా గెటప్స్ తో కోబ్రా అనే సినిమాతో వస్తున్నాడు. అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వం వహిస్తున్న ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌తో అన్ని చిత్ర పరిశ్రమల్లో సినిమాల షూటింగ్‌లు, రిలీజ్‌లు వాయిదా పడుతున్న సంగతి తెలిసిందే. దీంతో ఇప్పుడు‘కోబ్రా’ సినిమా థియేటర్స్‌లో విడుదల కాదని, ఓటీటీలో స్ట్రీమింగ్‌ అవుతుందనే టాక్‌ వినిపించింది. ఈవార్తలపై చిత్రయూనిట్‌ స్పందిస్తూ.. కోబ్రా మూవీ ఓటీటీలో రిలీజ్ చేస్తున్నామన్నవార్తల్లో నిజం కాదు. థియేటర్స్‌లోనే విడుదల చేస్తాం అని క్లారిటీ ఇచ్చారు.

కాగా శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తుండగా ఇర్ఫాన్ పఠాన్ మరో కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాతోనే ఇర్ఫాన్ పఠాన్ వెండితెర ఆరంగేట్రం చేస్తున్నారు. వయకామ్ .. సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ వారు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి, ఎ.ఆర్.రెహ్మాన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. కేఎస్‌ రవికుమార్‌, మృణాలిని, కనికా, పద్మప్రియ, బాబు ఆంటోనీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. త్వరలో అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి ఈ ఏడాది రంజాన్‌ సందర్భంగా ‘కోబ్రా’ విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది .

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.