కరోనా ప్రభావం మళ్లీ పెరుగుతుంది. మరీ ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో కరోనా కేసులు దారుణంగా పెరిగిపోతున్నాయి. బాలీవుడ్ లో ఇప్పటికే ఎంతో మంది సినీ సెలబ్రిటీలు కరోనా బారిన పడగా..ఇప్పుడు టాలీవుడ్ లో కూడా చాలా మంది ప్రముఖులు కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే దర్శకుడు త్రివిక్రమ్, నిర్మాత అల్లు అరవింద్, విజేయంద్రప్రసాద్, నివేదా థామస్ సహా పలువురు టాలీవుడ్ ప్రముఖులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
అయితే నివేదా థామస్, అంజలి కలిసి వకీల్ సాబ్ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే కదా. కరోనా కారణంగా నివేదా వకీల్ పాబ్ ప్రమోషన్స్ లో కూడా పాల్గొనలేదు. దీనితో సహనటి అంజలికి కూడా కరోనా పాజిటివ్ వచ్చిందంటూ అందుకే గత రెండు రోజులుగా వకీల్ సాబ్ ప్రమోషన్ కార్యక్రమాలకు దూరంగా ఉంటుందన్న వార్తలు వచ్చాయి. తాజాగా ఈవార్తలపై అంజలి తన ట్విట్టర్ ద్వారా స్పందించి క్లారిటీ ఇచ్చారు.గత కొద్దిరోజులుగా నాకు కోవిడ్ సోకిందంటూ పలు వార్తలు వచ్చాయి. అవన్నీ వట్టి రూమర్స్ మాత్రమే. ఏమాత్రం నిజం లేదు. నేను పూర్తి ఆరోగ్యంగా ఉన్నాను. నాకు కరోనా సోకలేదు. మీరందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నా” అని ట్వీట్ ద్వారా అంజలి పేర్కొంది.
— Anjali (@yoursanjali) April 8, 2021
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: