టాలీవుడ్ లో స్పోర్ట్స్ నేపథ్యంలో సినిమాలు రావడం చాలా అరుదు. కానీ ఈమధ్య మాత్రం స్పోర్ట్స్ బేస్ట్ సినిమాలు చాలా వస్తున్నాయి. ఇప్పటికే చాలా సినిమాలు కూడా రిలీజ్ అయ్యాయి. రీసెంట్ గానే సందీప్ కిషన్ నటించిన ఏ1 ఎక్స్ ప్రెస్ సినిమా రిలీజ్ అయి మంచి హిట్ టాక్ నే సొంతం చేసుకుంది. ఇప్పుడు మరికొన్ని సినిమాలు రావడానికి సిద్దంగా ఉన్నాయి. వాటిలో సీటీమార్, గని, లక్ష్య, లైగర్ సినిమాలు ఉన్నాయి. మాస్ డైరెక్టర్ సంపత్ నంది దర్శకత్వంలో గోపీచంద్, మిల్కీబ్యూటీ తమన్నా జంటగా నటిస్తున్న చిత్రం ‘సీటీమార్’. కబడ్డీ నేపథ్యంలో ఈసినిమా తెరకెక్కుతుంది. ఎప్రిల్ 2న ఈసినిమా రిలీజ్ కానుంది. ఇక సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో నాగశౌర్య హీరోగా వస్తున్న సినిమా విలు విద్య నేపథ్యంలో తెరకెక్కుతుంది. మరోవైపు వరుణ్ తేజ్ హీరోగా వస్తున్న గని సినిమా…పూరీ జగన్నాథ్-విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో వస్తున్న లైగర్ సినిమా రెండూ బాక్సింగ్ నేపథ్యంలో వస్తున్నవే. ప్రస్తుతం ఈసినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. మరి ఈ స్పోర్ట్స్ నేపథ్యంలో వస్తున్న సినిమాల్లో మీరు ఏ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
[totalpoll id=”57430″]




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: