గత ఏడాది సినిమాలు లేకపోవడంతో ఈఏడాది ఎలా లేదనుకున్నా బ్యాక్ టు బ్యాక్ మూడు సినిమాలతో అలరించడానికి రెడీ అయిపోయాడు నితిన్. ఇప్పటికే చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో వచ్చిన నితిన్ సినిమా రిలీజ్ అయింది. ఇప్పుడు మరో సినిమా రిలీజ్ కు సిద్దంగా ఉంది. వెంకీ అట్లూరి దర్శకత్వంలో నితిన్ హీరోగా ‘రంగ్ దే’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మార్చి 26వ తేదీన ఈ సినిమా రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈసినిమా నుండి టీజర్ పలు పాటలు కూడా రిలీజ్ అయ్యాయి. ఇక రిలీజ్ డేట్ కూడా దగ్గర పడుతుండటంతో ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించింది చిత్రయూనిట్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
దీనిలోభాగంగానే ట్రైలర్ ను కూడా రిలీజ్ చేయనున్నారు. అయితే ఈ ట్రైలర్ రిలీజ్ ను కాస్త వినూత్నంగా ప్లాన్ చేశారు. మార్చి 19న కర్నూల్ లో ఒక ఈవెంట్ నిర్వహించి అక్కడ రిలీజ్ చేయనున్నారు. కర్నూల్ లోని ఏస్టీబీసీ కాలేజ్ లో ఈకార్యక్రమం నిర్వహించనున్నారు. సాయంత్రం 6గంటల నుండి జరిగే ఈ కార్యక్రమంలో ట్రైలర్ రిలీజ్ చేయనున్నారు.
#RangDeONmarch26 pic.twitter.com/bPN6wQjGfV
— nithiin (@actor_nithiin) March 17, 2021
కాగా ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుండగా సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోంది. ఇంకా ఈ సినిమాలో సీనియర్ నటుడు నరేష్, వినీత్, రోహిణి, కౌసల్య, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్, సత్యం రాజేష్, అభినవ్ గోమటం, సుహాస్, గాయత్రి రఘురామ్ తదితరులు నటిస్తున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు పి సి శ్రీరామ్ ఛాయాగ్రహణం సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:































