రానా నుండి సినిమా వచ్చి చాలా కాలమే అయింది. లాంగ్ గ్యాప్ తరువాత ఈ ఏడాది రెండు సినిమాలతో ప్రేక్షకులను అలరించడానికి వచ్చేస్తున్నాడు. వేణు ఊడుగుల దర్శకత్వంలో రానా, సాయిపల్లవి కాంబినేషన్లో వస్తున్న సినిమా విరాటపర్వం. ఇక ఈ సినిమాలో రానా పొలిటికల్ లీడర్ గా.. సాయి పల్లవి నక్సలైట్ గా కనిపించనున్న సంగతి కూడా విదితమే. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్న ‘విరాటపర్వం’ను ఏప్రిల్ 30న విడుదల చేయనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజాగా ఈసినిమాకు సంబంధించి ఒక అప్ డేట్ ఇచ్చింది చిత్రయూనిట్. ఈసినిమా టీజర్ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేస్తూ అధికారికంగా ప్రకటించారు. మార్చి 18వ తేదీన సాయంత్రం 5గంటల 4 నిమిషాలకు టీజర్ ను రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు. మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా టీజర్ రిలీజ్ చేయనున్నారు.
#VirataParvamTeaser ni Megastar @KChiruTweets garu 18th March, 5:04 PM ki release chestunnaraho💥
#VirataParvamOnApril30#VirataParvam@RanaDaggubati @Sai_Pallavi92 @nanditadas @venuudugulafilm #Priyamani @Naveenc212 @sureshbobbili14 @dancinemaniac @SLVCinemasOffl pic.twitter.com/lOPncvrxlR— Suresh Productions (@SureshProdns) March 16, 2021
కాగా ఇంకా ఈసినిమాలో నందితా దాస్, ప్రియమణి, ఈశ్వరీ రావ్,జరీనా వహాబ్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. 1990 ల నాటి సామజిక పరిస్థితుల ఆధారం గా రూపొందుతున్న ఈ మూవీని ఎస్ ఎల్ వి సినిమాస్, సురేష్ ప్రొడక్షన్స్ పై సురేష్ బాబు, సుధాకర్ చెరుకూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: