‘బట్టల రామస్వామి బయోపిక్కు’ టీజర్ రిలీజ్

Battala Ramaswamy Biopikku Telugu Movie Teaser Is Out Now,Battala Ramaswamy Biopikku Movie Teaser,Altaf Hassan,Shanthi Rao,Bhadram,Ram Narayan,Battala Ramaswamy Biopikku Movie Teaser Released,Telugu Filmnagar,Telugu Film News 2021,Tollywood Movie Updates,Battala Ramaswamy Biopikku Movie Teaser,Battala Ramaswamy Biopikku Teaser,Battala Ramaswamy,Battala Ramaswamy Biopikku,Battala Ramaswamy Biopikku Movie,Battala Ramaswamy Biopikku Telugu Movie,Battala Ramaswamy Biopikku Telugu Movie Teaser,Battala Ramaswamy Biopikku Teaser,Battala Ramaswamy Biopikku Teaser Telugu,Battala Ramaswamy Biopikku 2021 Telugu Movie,Battala Ramaswamy Biopikku Movie News,Latest Telugu Teasers 2021,Battala Ramaswamy Biopikku Movie Teaser Out Now,Teaser Of Battala Ramaswamy Biopikku,Ramakrishna Veerapaneni,Battala Ramaswamy Biopikku Teaser Out

రామ్ నారాయణ్ దర్శకత్వంలో అల్తాఫ్ హసన్, శాంతి రావ్, సాత్విక, లావణ్యరెడ్డి, శ్రీ చందన, శ్రీ వర్ధన్, నటరాజ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న సినిమా ‘బట్టల రామస్వామి బయోపిక్కు’. నూతన నటీ నటులతో.. న్యూ ఏజ్ కామెడీ ఎంటర్ టైనర్ గా ఈసినిమా తెరకెక్కుతుంది.మ్యాంగో మీడియా ప్రెజెంట్స్, సెవన్ హిల్స్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై సతీష్ కుమార్ ఐ, రామ కృష్ణ వీరపనేని ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఈ సినిమా టీజర్ ను తాజాగా రిలీజ్ చేయగా అది అందర్నీ ఆకట్టుకుంటుంది. జీవిత చరిత్రలు పెద్ద నాయకులు, సినిమా యాక్టర్లకే కాదు సామాన్య మనుషులకు కూడా ఉంటాయి అంటూ మొదలైన టీజర్ లో ఒక్కోపాత్రను పరిచయం చేశారు. జయప్రదగా కిరాకాభినేత్రి శాంతిరావు, జయసుధగా నట పఠాకా లావణ్య రెడ్డి, శ్రీదేవిగా అభినవ నట కంచు సాత్విక, బట్టల రామస్వామిగా నట దురంధర ఆల్తాఫ్ హాసన్ నటిస్తున్నాడు అంటూ వారి పాత్రలు సినిమాలో ఎలా ఉంటాయో చూపించారు. తీసే వాడు ఉండాలే కానీ ప్రతివాడి బతుకూ ఒక బయోపిక్కే అన్న డైలాగ్ బాగుంది. ప్రతి కథలోనూ ట్విస్ట్ లు ఉంటాయి కానీ బట్టల రామస్వామి విషయానికి వచ్చేసరికి ట్విస్టుల్లోనే కథ ఉంటుందన్న డైలాగ్ తో కథ మొత్తం ఆ పాత్ర చుట్టూనే తిరుగుతుందని అర్ధమవుతుంది. త్వరలోనే ఈ సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × two =