మార్చి 5 రిలీజ్ సినిమాలు

Movie Releases This Week – 5th March 2021,A1 Express,Power Play,Ardhashathabdam,Shaadi Mubarak,List Of Movies Releasing This Week,Movie Releases On 5th March,Movie Releases In This Week,Movies List,A1 Express Movie,A1 Express Movie Release,A1 Express Telugu Movie,Power Play,Power Play Movie,Power Play Telugu Movie,Shaadi Mubarak,Shaadi Mubarak Movie,Shaadi Mubarak Telugu Movie,Gajakesari,Gajakesari Movie,Gajakesari Telugu Movie,Telugu Movie Releases In This Week,Tollywood Movie Releases In This Week,List Of Tollywood Movies Releasing This Week,Telugu Filmnagar,Telugu Film News 2021,Tollywood Movie Updates,2021 Latest Telugu Movies,Latest Tollywood Movies 2021,List Of Movies This Week,Movie Releases List,Upcoming Movies 2021,List of Movies Releasing This Friday

ఈవారం కూడా థియేటర్ల దగ్గర సినిమాల సందడి మొదలైంది. నిజానికి ఫిబ్రవరి, మార్చి అంటే తెలుగు ఇండస్ట్రీకి అన్ సీజన్ అంటారు. సంక్రాంతి తరువాత ఈరెండు నెలల్లో పెద్దగా సినిమాలు రిలీజ్
చేయరు. ఈ రెండు నెలలు స్కిప్ చేసి సమ్మర్ లో మళ్లీ సినిమా రిలీజ్ డేట్ లు పెట్టుకుంటారు. అయితే గత ఏడాది సినిమాలు లేకపోవడంతో ఈఏడాది ఆ సంప్రదాయానికి బ్రేక్ చెప్పారు. ఫిబ్రవరి మార్చి లో కూడా సినిమాలు వరుసపెట్టి రిలీజ్ అయిపోతున్నాయి. ముందు ముందు పెద్ద సినిమాలు వస్తుండటంతో వీలైనంత త్వరగా థియేటర్లోకి రావడానికి చిన్న సినిమాలు రెడీ అవుతున్నాయి. ఇక మార్చి 5 కూడా సినిమాల హవా మొదలుకానుంది. మరి ఈవారం రిలీజ్ అయ్యే సినిమాలు ఏంటో చూద్దాం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

పవర్ ప్లే

విజ‌య్ కుమార్ కొండా ద‌ర్శ‌క‌త్వంలో రాజ్ తరణ్ చేస్తున్న రెండో సినిమా పవర్ ప్లే. శ్రీ‌మ‌తి ప‌ద్మ స‌మ‌ర్ప‌ణ‌లో వ‌న‌మాలి క్రియేష‌న్స్ ప్రై.లి ప‌తాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం.1గా రూపొందుతోన్నఈ చిత్రాన్ని మ‌హిద‌ర్‌, దేవేష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్ప‌టికే విడుద‌లైన ఫ‌స్ట్‌లుక్‌మోష‌న్ పోస్ట‌ర్‌, టీజ‌ర్‌, కి మంచి రెస్పాన్స్ రాగా ఇటీవలే ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఇక ఈ ట్రైలర్ తో సినిమాపై అంచనాలు పెంచేశాడు రాజ్ తరుణ్. ఇప్పటి వరకూ లవ్ అండ్ యాక్షన్ సినిమా చేసిన రాజ్ తరుణ్ ఈసారి డిఫరెంట్ స్టోరీతో వస్తున్నాడని అర్ధమైంది. తను చేయని నేరంలో రాజ్ తరణ్ ఇరుకున్నట్టు దాని నుండి బయటపడేందుకు తను చేసే ప్రయత్నాలే ఈ సస్పెన్స్ థ్రిల్లర్ అని తెలుస్తోంది. హేమల్‌ హీరోయిన్ గా నటిస్తున్న ఈసినిమాలో నటి పూర్ణ ఒక కీలకపాత్రలో నటిస్తుంది. సురేష్‌ బొబ్బిలి సంగీతం అందిస్తున్న ఈసినిమా మార్చి 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి సినిమా ఎలా ఉంటుందో తెలియాలంటే రెండు రోజులు వెయిట్ చేయాల్సిందే.

A1 ఎక్స్ ప్రెస్

డెన్నిస్ జీవన్ కనుకొలను దర్శకత్వంలో సందీప్ కిషన్ A1 ఎక్స్ ప్రెస్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. న్యూ-ఏజ్ స్పోర్ట్స్ ఎంట‌ర్‌టైన‌ర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా టాలీవుడ్ ఇండస్ట్రీలోనే హాకీ నేపథ్యంలో వస్తున్న మొట్ట మొదటి సినిమా కావడం విశేషం. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ కు ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. కాగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, వెంకటాద్రి టాకీస్ బ్యానర్స్ పై ఈ సినిమా రూపొందుతుంది. లావణ్య త్రిపాఠి హీరోయిన్ నటిస్తున్న ఈ సినిమాలో మురళీశర్మ, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. హిప్ హాప్ తమిళ సంగీతం అందిస్తున్నాడు. ఇక ఈసినిమా కూడా మార్చి 5 న రిలీజ్ అవుతుంది. ఈసినిమా మంచి హిట్ అవుతుందని సందీప్ కిషన్ కూడా నమ్మకంతో ఉన్నాడు.

షాదీ ముబారక్

మొగలిరేకులు’ సీరియల్‌లో ఆర్కే నాయుడిగా బుల్లితెర ప్రేక్షకులను అలరించిన సాగర్ ఈసారి పద్మశ్రీ దర్శకత్వంలో ప్రస్తుతం ‘షాదీ ముబారక్’ సినిమాతో వస్తున్నాడు. ఇక ఈసినిమా దిల్ రాజు ప్రొడక్షన్ లో వస్తుండటంతో సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి. ఎందుకంటే మ్యాటర్ ఉంటే కాని దిల్ రాజు సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడు. దీనితో ఈ సినిమాలో కూడా విషయం ఉండే ఉంటుంది అందుకే దిల్ రాజు నిర్మించాడు అన్న అభిప్రాయానికి వస్తున్నారు. ఇక దానికి తగ్గట్టే సినిమా టీజర్ ట్రైలర్ కూడా సినిమాపై అంచనాలు ఏర్పడింది. ఇంటిపేరు నేపథ్యంలో ఈసినిమా వస్తుందని ఇప్పటికే అర్ధమైంది.
కాగా దృశ్యా రఘునాథ్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌లో దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. ఇంకా ఈ సినిమాలో అదితి, ఝాన్సీ, హేమ, రాజశ్రీనాయర్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. మార్చి 5న ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

గ‌జ‌కేస‌రి

ఎస్ కృష్ణ దర్శకత్వంలో యష్ హీరోగా కన్నడలో వచ్చిన హిస్టారికల్ సినిమా గజకేసరి. 2014 లో వచ్చిన ఈసినిమాను ఇప్పుడు తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. రీసెంట్ గానే ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేయగా అది బాగానే ఆకట్టుకుంది. అమూల్య, అనంత్ నాగ్, సాధుకోకిల, గిరిజా లోకేశ్ నటించిన ఈ చిత్రానికి సంగీతం వి. హరికృష్ణ అందించారు. శ్రీ వేదాక్షర మూవీస్, కలర్ అండ్ క్లాప్ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై రామారావు చింతపల్లి, ఎం.ఎస్. రెడ్డి ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈసినిమాను మార్చి 5న తెలుగులో విడుద‌ల చేయ‌నున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × one =