హాలీవుడ్ డైరెక్టర్ జెఫ్రీ గీ చిన్ దర్శకత్వంలో మంచు విష్ణు హీరోగా కాజల్ అగర్వాల్, సునీల్ శెట్టి ముఖ్య పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం ‘మోసగాళ్ళు’. అతిపెద్ద ఐటీ కుంభకోణాల్లో ఒకటిగా నిలిచిన స్కామ్ వెనుక ఉన్న మిస్టరీని ఛేదించే కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి పలు పోస్టర్ లను రిలీజ్ చేయగా వాటికి మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై మంచి అంచనాలే ఏర్పడ్డాయి. ఇటీవలే రిలీజ్ చేసిన ట్రైలర్ కు కూడా మంచి రెస్పాన్స్ రావడంతో ఈసినిమపై అంచనాలు ఇంకా పెరిగాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమాను తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ మరియు మలయాళ భాషల్లో కూడా రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే కదా. అయితే తెలుగులో ఈసినిమాను మోసగాళ్ళు అనే టైటిల్ తో రిలీజ్ చేస్తుండగా.. మిగిలిన భాషల్లో టైటిల్స్ ఫిక్స్ చేస్తూ నేడు ప్రకటించారు. తమిళ, కన్నడ, హిందీ భాషల్లో ‘అను అండ్ అర్జున్’ అనే పేరు ఖరారు చేయగా.. మలయాళంలో మాత్రం ‘అర్జున్ అండ్ అను’ అని పెట్టారు.
Here’s the title of #Mosagallu “The world’s biggest IT scam” in other languages.#AnuAndArjun in Tamil, Kannada & Hindi.#ArjunAndAnu in Malayalam.@iVishnuManchu @MsKajalAggarwal @SunielVShetty @ruhisingh11 @Naveenc212 @pnavdeep26 @TheLeapMan @24FramesFactory @MangoMusicLabel pic.twitter.com/o6qbYefJJQ
— Kajal Aggarwal (@MsKajalAggarwal) March 3, 2021
కాగా నవదీప్, నవీన్ చంద్ర, రుహాని సింగ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రాన్ని ఏవీఏ ఎంటర్‌టైన్‌మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తోంది. తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో ఒకేసారి రూపొందుతున్న ఈ క్రైమ్ థ్రిల్లర్ తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో కూడా విడుదల కానుంది. షెల్డన్ చౌ సినిమాటోగ్రఫి అందిస్తున్న ఈ సినిమాకు.. శ్యామ్ సీఎస్ సంగీతం అందిస్తున్నాడు. ఇక మార్చి 19న ఈ సినిమా థియేటర్లలో రానుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: