టాలీవుడ్ మోస్ట్ వర్సటైల్ యాక్ట్రెస్ సమంత ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ యాక్షన్ కామెడీ డ్రామా ‘మా ఇంటి బంగారం’. బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్లతో సంచలనం సృష్టించి, తెలుగు చలనచిత్ర పరిశ్రమలోనే అత్యధిక వసూళ్లు సాధించిన హీరోయిన్-ఓరియెంటెడ్ చిత్రంగా సరికొత్త చరిత్ర లిఖించింది. ప్రపంచవ్యాప్తంగా రూ. 100 కోట్లకు పైగా గ్రాస్ సాధించిన ఈ బ్లాక్‌బస్టర్ చిత్రం, థియేట్రికల్ రన్ ముగించుకుని ఎట్టకేలకు డిజిటల్ స్క్రీన్లపై సందడి చేయడానికి వచ్చేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ మోస్ట్ అవేటెడ్ మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జియోహాట్‌స్టార్ వేదికగా ఈరోజు నుండి స్ట్రీమింగ్ అవుతోంది. సమంత సొంత నిర్మాణ సంస్థ ‘ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్’ నిర్మించిన ఈ చిత్రం కేవలం నాలుగు వారాల్లోనే ఓటీటీలోకి రావడం విశేషం.
సమంత భర్త రాజ్ నిడిమోరు కథ అందించగా, విలక్షణ దర్శకురాలు బి.వి. నందిని రెడ్డి ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారు. ఒక సాధారణ గృహిణిగా, పద్ధతైన కోడలిగా (స్వర్ణ పాత్రలో) సంసారాన్ని చక్కబెట్టుకునే మహిళ వెనుక ఒక ప్రమాదకరమైన గతం దాగి ఉంటుంది.
తన కొత్త కుటుంబానికి పాత శత్రువుల నుండి ముప్పు పొంచి ఉందని తెలిసినప్పుడు, ఆమె తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి తిరిగి ఆయుధం ఎలా పట్టింది? అనే ఆసక్తికరమైన కాన్సెప్ట్‌తో నవ్వులు పూయిస్తూనే, అదిరిపోయే యాక్షన్ ఎలిమెంట్స్‌తో ఈ సినిమా సాగుతుంది. సంతోష్ నారాయణన్ అందించిన అదిరిపోయే మ్యూజిక్ సినిమాకు మరో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. థియేటర్లలో మిస్ అయిన వారు అలాగే మళ్లీ మళ్లీ చూడాలనుకునే వారు ఈ వీకెండ్ ఫ్యామిలీతో కలిసి ఈ క్రేజీ యాక్షన్ ఎంటర్టైనర్ను జియోహాట్‌స్టార్‌లో హ్యాపీగా వీక్షించవచ్చు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























