‘రాధే శ్యామ్’ ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్-రిలీజ్ డేట్ ఫిక్స్

Radhe Shyam Movie First Glimpse Is Out,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Radhe Shyam Telugu Glimpse,Radhe Shyam Glimpse,Prabhas,Pooja Hegde,Radha Krishna Kumar,Justin Prabhakaran,UV Creations,Radhe Shyam Official Teaser,Prabhas Radhe Shyam Glimpse,Radhe Shyam Teaser,Prabhas Radhe Shyam Release Date,Radhe Shyam Telugu Movie,Prabhas New Movie Teaser,Radhe Shyam Movie First Glimpse,Prabhas Radhe Shyam,Radhe Shyam Telugu Movie Glimpse,Prabhas Latest Movie Teaser,Prabhas New Movie Glimpse,Radhe Shyam Movie Telugu Glimpse,Radhe Shyam Telugu Glimpse Out,Prabhas Radhe Shyam Telugu Glimpse,#RadheShyamGlimpse​

ఒకప్పుడు ప్రభాస్ సినిమాల నుండి ఒక అప్ డేట్ రావడమే గగనంగా ఉండేది. కానీ ఇప్పుడు అలా కాదు ఈ పాన్ ఇండియా స్టార్ వరుసపెట్టి నాలుగు పాన్ ఇండియా లెవల్ సినిమాలు చేస్తున్నాడు. ఇక వాటికి సంబంధించి ఏదో ఒక అప్ డేట్ ఇస్తూ సర్పరైజ్ ల మీద సర్పరైజ్ లు ఇస్తున్నారు. ఇక నేడు ప్రేమికుల రోజు. అసలే రాధేశ్యామ్ అనే ప్రేమ కావ్యం తో వస్తున్నాడు ప్రభాస్. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుండి టీజర్ వదులుతామని చిత్రయూనిట్ ఇప్పటికే ప్రకటించింది. దీనితో ఆ రోజు ఎప్పుడెప్పడు వస్తుందా.. ఎప్పుడెప్పుడు టీజర్ చూద్దామా అని ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. డార్లింగ్ ప్రభాస్ అభిమానుల ఎదురుచూపులకు ఫుల్ స్టాప్ పడింది. ఫైనల్లీ టీజర్ వచ్చేసింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

టీజర్ ను చూస్తుంటే ప్రభాస్ మంచి లవర్ బాయ్‌గా కనిపిస్తున్నాడు. ప్రేయసి వెనుకపడే రోమియోగా సర్ ప్రైజ్ చేశాడు ప్రభాస్. ‘నువ్వేమైనా రోమియో అనుకుంటున్నావా? అని పూజా హెగ్డే అంటుండగా.. ఛ!! వాడు ప్రేమకోసం చచ్చాడు నేను ఆ టైప్ కాదు’ అంటూ చెప్పే డైలాగ్‌ ఆకట్టుకుంది. మంచి రొమాంటిక్ ఫీల్ వచ్చే బ్యాగ్ గ్రౌండ్ మ్యూజిక్.. ప్రభాస్ రొమాంటిక్ లుక్ ఈ వీడియోలో హైలైట్ అయ్యాయి. దీనితో పాటు రిలీజ్ డేట్ ను కూడా ప్రకటించారు. జులై 30న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు.

రాధాకృష్ణ ద‌ర్శ‌క‌త్వం లో ఈ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. 1970 బ్యాక్‌డ్రాప్‌లో పీరియాడిక‌ల్ ల‌వ్‌స్టోరీగా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుండగా.. భాగ్య శ్రీ, మురళీ శర్మ, ప్రియదర్శి, కునాల్ రాయ్ కపూర్, సచిన్ ఖేదేకర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ మరియు మలయాళంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాను గోపికృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇక తెలుగు, తమిళ్, కన్నడ మరియు మలయాళం భాషలకు జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందించనుండగా… రాధే శ్యామ్ హిందీ వెర్షన్ కు మిథున్, మనన్ భరద్వాజ్ సంగీతం అందించనున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

6 − 6 =