2003లో ‘ గంగోత్రి ‘ చిత్రంతో హీరోగా కెరీర్ ప్రారంభించి ఇప్పుడు స్టార్ హీరో రేంజ్ కు ఎదిగిన నటుడు అల్లు అర్జున్. తండ్రి టాప్ ప్రొడ్యూసర్.. తాత అలనాటి ప్రముఖ కమెడియన్.. ఇంకా మేనమామ అగ్ర హీరో ఒకపక్క వారి ప్రోత్సాహం అందినా కూడా తన కష్టం తో.. పట్టుదలతో ఇప్పుడు ఈ స్థాయికి చేరుకున్నాడు. తన స్టయిల్ తో.. నటనతో.. డ్యాన్స్ తో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. ఇన్నేళ్ల తన సినీ కెరీలో లో ఎన్నో విభిన్నమై సినిమాల్లో నటించాడు. పాత్ర ప్రాముఖ్యత చూస్తాడు కాబట్టే వేదం.. రుద్రమదేవి సినిమాల్లో నిడివి తక్కువైనా కూడా అంత పేరు ప్రఖ్యాతలు వచ్చాయి. ఆర్య, ఆర్య 2, హ్యాపీ, జులాయి,రేసుగుర్రం, సన్నాఫ్ సత్యమూర్తి, రీసెంట్ గా సంచలన విజయాన్ని సాధించిన అల వైకుంఠపురం చిత్రాల్లో క్లాస్ గా మాత్రమే నటించడమే కాదు.. దేశముదురు, బన్నీ, బద్రీనాథ్, సరైనోడు,దువ్వాడ జగన్నాథం వంటి మాస్ పాత్రల్లో కూడా ఒదిగిపోయి నటించగలిగే సత్తా ఉన్న నటుడు. ఇక డైరెక్టర్స్ కూడా బన్నీ లాంటి ఈజ్ ఉన్న హీరోతో సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. అందుకే త్రివిక్రమ్ తో మూడు సినిమాలు, సుకుమార్ తో మూడు సినిమాలు చేయగలిగాడు. మరి ఇప్పటి వరకూ బన్నీ పలువురు డైరెక్టర్ తో నటించగా వారిలో ఎవరి కాంబినేషన్ అంటే మీకు ఇష్టమో మీ ఓటు ద్వారా తెలపండి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
[totalpoll id=”55889″]
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: